శుక్రవారం, జనవరి 31, 2014

మబ్బులోన చందమామ...

ఇళయరాజా గారి స్వరకల్పనలో సాహసమే జీవితం సినిమాకోసం ఏసుదాస్ గారు పాడిన ఈ పాట చాలా చాలా బాగుంటుంది. వేటూరి గారి చక్కని సాహిత్యం ఏసుదాస్ గారి కమ్మనైన గళంలోనుండి అలవోకగా జాలువారుతుంటే మనసు హాయైన లోకాలలో తేలిపోతూ ఆ మబ్బుచాటు చందమామని దర్శించేస్తుంది. ఈ చక్కని పాట మీరూ ఆస్వాదించండి. ఈ ప్లగిన్ పని చేయకపోతే ఇక్కడ డౌన్లోడ్ ప్రయత్నించండి. 


   
చిత్రం : సాహసమే జీవితం (1984)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : ఏసుదాస్

బాదలోంమే..చంద్రమా..దిల్ హీ దిల్మే చాందినీ..
బాదలోంమే..చంద్రమా..దిల్ హీ దిల్మే చాందినీ.. 

ఘూంఘట్ కె పీచే..ఖూబ్ సూరత్..సమఝ్ మే..బసే..హ..హా 
బాదలోంమే..చంద్రమా..దిల్ హీ దిల్మే చాందినీ..

 మబ్బులోన చందమామ... మనసులోన వెన్నెలమ్మ
మబ్బులోన చందమామ... మనసులోన వెన్నెలమ్మ
తెరల మాటు సొగసు కాస్త..తెలిసిన వేళ..ఆ..హ..హ..హ..
మబ్బులోన చందమామ... మనసులోన వెన్నెలమ్మ


లేత గాలి సోకగానే..నీలిమబ్బు కరిగిపోయే
జాబిలమ్మ వెలగదా...జాజివాన కురవదా..ఆ..ఆ
బిడియమే..ఏ..ఏ.. తీరిపోయి..వడికి తాను చేరదా..ఆ..
కనులతో..ఓ..ఓ.. ముద్దులాడి..కౌగిలింతలీయదా..ఆ
మోము చాటు చేసినా..ఆ..ఆ.. మోహనమేగా..ఆ..ఆ..

మబ్బులోన చందమామ... మనసులోన వెన్నెలమ్మ

కన్ను నేను గీటగానే..కన్నె సిగ్గు తీరిపోయే..
జోరు ఇంక..ఆగునా...జారు పైట నిలుచునా..ఆ
ఎవ్వరెన్ని వాగినా..ఆ... యవ్వనాలు దాగునా..ఆ
కొమ్మ పూలు పూయగా..ఆ..తుమ్మెదొచ్చి వాలదా..ఆ..
ఎంత దూరమేగినా..ఆ.. చేరువకేగా..ఆ..

పాటలాంటి వయస్సు నాది..పల్లవించు సొగస్సు నీది
శరణమయిన సాగదా..ఆ..చెలిని నేను చేరగా..
ప్రణయమే గానమైన..హృదయవీణ మ్రోగదా..ఆ
పల్లకీ..ఈ..కోరుకున్న..పడుచు ఆశ తీరదా..ఆ
విరహబాధ తీయనీ..వేదన కాదా..ఆ..ఆ

మబ్బులోన చందమామ... మనసులోన వెన్నెలమ్మ
తెరల మాటు సొగసు కాస్త.. తెలిసిన వేళ..ఆ..హ..హ..హ..
మబ్బులోన చందమామ... మనసులోన వెన్నెలమ్మా...

6 comments:

బావుందండి పాట.ఎప్పుడూ వినలేదు. టిపికల్ ఇళయరాజా మ్యూజిక్..తెలిసిపోతోంది..:)

థాంక్స్ తృష్ణ గారు :-)

థాంక్స్ కార్తీక్ గారూ :-)

బాల కృష్ణ హీరోగా మొదటి సినిమా యిది..అందుకే పరిధులు దాటని యాక్షన్ చూడచ్చు.. ఏసుదాస్ గారి జాబిలి పాటలలో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్..కనులు మూసుకుంటే పగలే వెన్నెలా' అనిపిస్తుంది..

థాంక్స్ శాంతి గారు, అవునా సినిమా గురించి అస్సలేమీ వివరాలు తెలియవండి. పాట వింటూ కనులు మూసుకుంటే పగలే వెన్నెల కనిపిస్తుందని బాగా చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.