సుశీల, జానకమ్మ, జిక్కీ ముగ్గురు కలిసి సిరిసంపదలు సినిమా కోసం పాడిన ఈపాటకి ఇక వేరే ప్రత్యేకతలు ఏవైనా అవసరమా అసలు... ముగ్గురు మధుర గాయనీమణులు కన్నయ్యకోసం గొంతు కలపడమే అద్భుతం కదా. మాస్టర్ వేణు గారి స్వరకల్పనలో ఆత్రేయ గారి సాహిత్యం సైతం ఆకట్టుకుంటుంది. ఈ మధురమైన పాట మీకోసం... చూసీ వినీ ఆనందించండి, ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.
చిత్రం : సిరి సంపదలు (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం : ఆత్రేయ
గానం : పి.సుశీల, యస్.జానకి, జిక్కి
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం : ఆత్రేయ
గానం : పి.సుశీల, యస్.జానకి, జిక్కి
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే..
దోర వయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను
దోర వయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను
అంత మొనగాడటే ఒట్టి కథలేనటే
ఏది కనపడితే నిలవేసి అడగాలి వానినే...
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే...
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట
లేదు లేదనుచూ లోకాలు చూపాడట
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట
లేదు లేదనుచూ లోకాలు చూపాడట
అంత మొనగాడటే వింత కథలేనటే
ఏది కనపడితే కనులారా చూడాలి వానినే...
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే..
దుడుకు కృష్ణ్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
దుడుకు కృష్ణ్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
ఘల్లు గల్ గల్లన ఒళ్ళు ఝల్ ఝల్లన
తాను ఫణిరాజు పడగపై తారంగమాడేనట
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే..
దోర వయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను
దోర వయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను
అంత మొనగాడటే ఒట్టి కథలేనటే
ఏది కనపడితే నిలవేసి అడగాలి వానినే...
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే...
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట
లేదు లేదనుచూ లోకాలు చూపాడట
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట
లేదు లేదనుచూ లోకాలు చూపాడట
అంత మొనగాడటే వింత కథలేనటే
ఏది కనపడితే కనులారా చూడాలి వానినే...
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే..
దుడుకు కృష్ణ్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
దుడుకు కృష్ణ్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
ఘల్లు గల్ గల్లన ఒళ్ళు ఝల్ ఝల్లన
తాను ఫణిరాజు పడగపై తారంగమాడేనట
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే..
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే..
తాను ఫణిరాజు పడగపై తారంగమాడేనట |
2 comments:
యే వయసు వాళైనా నా చిన్నప్పుడు ఇలా చేశానట అని చెప్పేటపుడు తమాషా ఐన అనుభూతికి లోనవుతారు..టైం మెషిన్ లో బాల్యానికి వెళ్ళని వారూ. ఒక్క సారైనా తమ అల్లర్లని చిన్ని కృష్ణయ్య కొంటె పనులతో పోల్చు కోని వారూ యెవారూ వుండరేమో కదండీ..
థాంక్స్ శాంతి గారు.. చాలామందికి బాల్యం అపురూపమే కదండీ మరి :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.