గురువారం, జనవరి 23, 2014

మధువొలకబోసే..

రామకృష్ణ గారి గళంలో ఆకట్టుకునే గీతం కన్నవారికలలు లోనీ ఈ మధువొలకబోసే గీతం. టిపికల్ సెవెంటీస్ తరహా చిత్రీకరణ ఇపుడు చూస్తే కొంచెం నవ్వొస్తుంది కానీ అప్పట్లో శోభన్ బాబు గారు వాణీశ్రీ లమీద తీసిన చిత్రీకరణ బహుశా ఒక ఊపు ఊపి ఉండచ్చేమో :-) ఈపాట కూడా నాకు రేడియోలోనే పరిచయం తరచుగా వినేవాడ్ని. ఈ అందమైన పాట మీకోసం ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు.      


చిత్రం : కన్నవారికలలు
సాహిత్యం : రాజశ్రీ ? సినారె
సంగీతం : వి.కుమార్
గానం : రామకృష్ణ, సుశీల

మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళు
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ..
మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళు
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ..

మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళు
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ..

అడగకనే ఇచ్చినచో అది మనసుకందము
అనుమతినే కోరకనే నిండేవు హృదయము
తలవకనే కలిగినచో అది ప్రేమ బంధము
బహుమతిగా దోచితివి నాలోని సర్వము
మనసు మనసుతో ఊసులాడనీ
మూగభాషలో బాస చేయనీ
ఈనాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ..

మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళు
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ..

గగనముతో కడలి చెలీ పలికినది ఏమనీ.. 
తలపులకూ వలపులకూ సరిహద్దు లేదనీ..
కుసుమముతో ఆ భ్రమరం తెలిపింది ఏమనీ..
జగమునకు మన చెలిమి ఆదర్శమౌననీ..
కలలు తీరగా కలిసిపొమ్మనీ
కౌగిలింతలో కరిగిపొమ్మనీ
ఈనాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ

మధువొలకబోసే..
హా...
ఈ చిలిపికళ్ళు..
ఆఆఆఆఅ
అవి నాకు వేసే..
హా ఆఅ ఆఅ
బంగారు సంకెళ్ళూ...

2 comments:

కళ్ళు..మనసు మాటను తెలిపే మధురమైన లోగిళ్ళు..
కళ్ళు..వేసవిలోనూ యెండి పోని వుప్పు నీటి పరవళ్ళు..

అందుకేనేమో మన గీత రచయితల కలం కన్నులని వర్ణిచడానికి యెప్పుడూ ముందుంటుంది..కదూ వేణూజీ..

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్.. :)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.