ఈ కొత్త సంవత్సరపు తొలి రోజు శుభాకాంక్షలతో ఓ ఆ పాత మధురం, మీ కోసం... యమునా తీరంలో, మలయ సమీరంలో, వెచ్చని వెన్నెలలో, వేడెక్కిన కలువలా, విరిసిన జాబిల్లి లా.. రాధమ్మ మనసు పలికే, రాగాల మాలికే ఈ పాట.. అందుకేనేమో, యెప్పుడు ఈ పాట విన్నా విరహపు జలపాతంలో తడిసి పోతున్న రాధమ్మ హృదయం, రాగ జలతరంగిణిలా నా మనసుని చుట్టేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు.. చల్లని ఈ ధనుర్మాసం లో ఆ రాధా మాధవుడు మన ముంగిట కొత్త వర్ణాలు అద్దాలని ఆశిస్తూ.. నీలమోహనా రా రా.. అనుకుందామా. ఈ అందమైన గీతాన్ని ఇక్కడ వినండి.
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : దేవులపల్లి
గానం : సుశీల
నీలమోహనా.. రారా
నిన్ను పిలిచె నెమలి నెరజాణ
నీలమోహనా.. రారా
నిన్ను పిలిచె నెమలి నెరజాణ
నీలమోహనా.. రారా
జారువలపు జడివాన కురిసెరా.. జాజిలత మేను తడిసెరా
జారువలపు జడివాన కురిసెరా.. జాజిలత మేను తడిసెరా
లతలాగే నా మనసు తడిసెరా.. నీలమోహనా.. రారా
రారా..రారా..
ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి?
ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి?
అతడేనేమో అనుకున్నానే.. అంత దవుల శ్రావణ మేఘములగనీ
అతడేనేమో అనుకున్నానే.. అంత దవుల శ్రావణ మేఘములగనీ
ప్రతిమబ్బు ప్రభువైతే... ప్రతికొమ్మ మురళైతే ఏలాగె
ఆ... ఏలాగె మతిమాలి.... ఏడే నీ వనమాలి?
హ హా హా..
హా హా..
నీలమోహనా.. రారా.. నిన్ను పిలిచె నెమలి నెరజాణ
నీలమోహనా.. రారా.. రా రా రా...
ఆ... సారెకు దాగెదవేమి?
నీ రూపము దాచి దాచి
ఊరించుటకా స్వామీ?
సారెకు దాగెదవేమి..?
నీ కన్నుల తోడు నీ కలికి నవ్వుల తోడు
నీకోసము ఎంత వేగిపోయానో కృష్ణా
కృషా కృష్ణా కృష్ణా...
సారెకు దాగెదవేమీ..?
అటు... అటు... ఇటు... ఇటు...
ఆ పొగడకొమ్మవైపు
ఈ మొగలి గుబురువైపు
కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా...
నీలిమేఘమాకాశము విడిచి... నేల నడుస్తుందా ?
కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా...
నీలిమేఘమాకాశము విడిచి... నేల నడుస్తుందా ?
నడిచే మబ్బులకు నవ్వే పెదవుందా?
నవ్వే పెదవులకూ మువ్వల మురళుందా?
పెదవి నందితే పేద వెదుళ్ళు కదిలి పాడుతాయా?
నడిచే మబ్బులకు నవ్వే పెదవులు
నవ్వే పెదవులకు మువ్వల వేణువులూ
మువ్వల వేణువులూ... మువ్వల వేణువులు
2 comments:
Wow ! Thanks Venu ji for posting this song. I love this song !
అవునా శ్రావ్యా.. థాంక్యూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.