ఆదివారం, జనవరి 12, 2014

చల్లగాలిలో యమునాతటిపై

ఈ పాట సినిమా పాట కాకపోయినప్పటికీ ప్రఖ్యాత సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు గారు స్వయంగా స్వరపరచి గానం చేసిన ఈ కృష్ణుడి పాట నాకు చాలా ఇష్టమ్ కనుక ఈ రోజు ఈ పాట షేర్ చేస్తున్నాను, మీరంతా కూడా విని ఆస్వాదించండి.
 

బాలు గారు సాలూరి వారి గురించి చెప్పిన కొన్ని కబుర్లు ఇక్కడ మరియూ ఇక్కడా చూడవచ్చు. ఆడియో ప్లగిన్ పనిచేయకపోతే ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని వినండి.  సాహిత్యం : బాలాంత్రపు రజనీకాంత రావు
సంగీతం : సాలూరు రాజేశ్వర రావు
గానం : సాలూరు రాజేశ్వర రావు

చల్లగాలిలో...ఓ..ఓ..
చల్లగాలిలో యమునాతటిపై
శ్యామసుందరుని మురళి
మురళీ, శ్యామసుందరుని మురళీ

చల్లగాలిలో యమునాతటిపై
శ్యామసుందరుని మురళి
మురళి, శ్యామసుందరుని మురళి
ఆఆఆఅ...
శ్యామసుందరుని మురళి

 ఉల్లము కొల్లగొనే మధుగీతులూ..ఆఅ.ఆఆఆ 
 ఉల్లము కొల్లగొనే మధుగీతులు
మెల్లమెల్ల చెవి సోకునవే
మెల్లమెల్ల చెవి సోకునవే

చల్లగాలిలో...ఓ..ఓ..
 
తూలి వ్రాలు వటపత్రమ్ములపై
తేలి తేలి పడు అడుగులవే...ఏ.ఏ..

తూలి వ్రాలు వటపత్రమ్ములపై
తేలి తేలి పడు అడుగులవే
 పూలతీవ పొదరిల్లు మాటు గా 
 పూలతీవ పొదరిల్లు మాటు గా
 పొంచిచూచు శిఖి పింఛమదే
చల్లగాలిలో..ఓ..ఓ

తరువు తరువు కడ డాగి డాగి
నన్నరయు కన్నుగవ మురుపులవే
 
తరువు తరువు కడ డాగి డాగి
నన్నరయు కన్నుగవ మురుపులవే
 

మురిసి మురిసి, నా వెనుక దరిసి
కనుమూయు చివురు కెంగేళులివే
మూయు చివురు కెంగేళులివే

చల్లగాలిలో యమునాతటిపై
శ్యామసుందరుని మురళి
మురళీ, శ్యామసుందరుని మురళీ
చల్లగాలిలో..ఓ..ఓ 

4 comments:


మై గాడ్ వేణూగారూ..మీరు వేసిన అన్ని సాంగ్స్ లోకీ అద్భుతమండీ ఈ పాట..రాజేశ్వర రావు గారి మాటెంత సున్నితమో మనసూ అంతే సున్నితమని ఆ తరం వాళ్ళందరూ అంటారు..ఆయన పాటెంత నవనీతమో మరో సారి మా అందరికీ గుర్తు చేశారు ఆ శ్యామ సుందరుని మురళిలా ..

థాంక్స్ శాంతి గారు, బాలు గారి వీడియోస్ లింక్ చేశాను చూశారా.. రాజేశ్వరరావు గారి గురించి ఎంత చెప్పినా వింటూ ఉండాలనిపిస్తుంది.

నమస్తే! నా చిన్నతనంలో...తరుచుగా వింటూండేవాళ్ళం!పాట పాడుమా కృష్ణా కూడా వింటూ ఉండేదాన్ని. నాకు ఎస్. రాజేశ్వరరావుగారి పాటలు...ఎంత ఇష్టమో నేను వివరించి చెప్పలేను. ఇందులో పొందుపరచిన వారికి నా కృతజ్నతాభినందనలు...
ఆచంటహైమవతి.

మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు హైమవతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.