మంగళవారం, జనవరి 28, 2014

ప్రేమ లేఖ రాశా నీకంది ఉంటది

సరే ఎలాగోలా ప్రేమ లేఖ రాసేశాము పంపేశాము కదా ఇకనేం హాయిగా రిలాక్స్ అయిపోవచ్చు అనుకుంటున్నారా అయితే ఈ ప్రేమికుడిని చూడండి. ప్రేమలేఖ రాసేసి ఊరికే కూర్చోకుండా దానివెంటనే తనుకూడా ప్రేయసి వద్దకి వెళ్ళి అందిందో లేదో అడుగుతూ ఎలా ఓ చక్కని డ్యూయెట్ వేసేసుకున్నాడో. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి. వీడియో క్రింద పదిహేనునిముషాల వరకూ ఫర్వర్డ్ చేసి చూడవచ్చు.  



చిత్రం : ముత్యమంత ముద్దు (1989)
సంగీతం : హంసలేఖ 

సాహిత్యం :  వేటూరి 
గానం : బాలు, జానకి

ప్రేమలేఖ రాశా .. నీకంది ఉంటదీ
పూల బాణమేశా .. ఎదకంది ఉంటదీ
నీటి వెన్నెలా .. వేడెక్కుతున్నదీ
పిల్ల గాలికే .. పిచ్చెక్కుతున్నదీ

మాఘమాసమా .. వేడెక్కుతున్నదీ
మల్లె గాలికే .. వెర్రెక్కుతున్నదీ
వస్తే ..గిస్తే ..వలచీ .. వందనాలు చేసుకుంట !

హంసలేఖ పంపా నీకంది ఉంటదీ
పూలపక్క వేశా అది వేచి ఉంటదీ

ఆడ సొగసు ఎక్కడుందొ చెప్పనా .. 
అందమైన పొడుపు కథలు విప్పనా
కోడెగాడి మనసు తీరు చెప్పనా .. 
కొంగుచాటు కృష్ణ కథలు విప్పనా 
సత్యభామ అలకలన్ని పలకరింతలే .. 
అన్నాడు ముక్కుతిమ్మనా
మల్లె తోట కాడ ఎన్ని రాసలీలలో .. 
అన్నాడు భక్త పోతనా
వలచి వస్తినే వసంతమాడవే .. 
సరసమాడినా క్షమించలేనురా
వలచి వస్తినే వసంతమాడవే .. 
సరసమాడినా క్షమించలేనురా
కృష్ణా ..గోదారుల్లో .. ఏది బెస్టొ చెప్పమంట ... !

హంస లేఖ పంపా నీకంది ఉంటదీ
పూల బాణమేశా ఎదకంది ఉంటదీ


మాఘమాస వెన్నెలెంత వెచ్చనా .. 
మంచి వాడివైతె నిన్ను మెచ్చనా 
పంటకెదుగుతున్న పైరు పచ్చనా .. 
పైట కొంగు జారకుండ నిలుచునా
సినీమాల కథలు వింటె చిత్తు కానులే .. 
చాలించు నీ కథాకళీ
ఆడవారి మాటకు అర్థాలే వేరులే .. 
అన్నాడు గ్రేటు పింగళీ
అష్ట పదులతో అలాగ కొట్టకూ .. 
ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే
అష్ట పదులతో అలాగ కొట్టకూ .. 
ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే
నుయ్యొ.. గొయ్యొ .. ఏదో అడ్డదారి చూసుకుంట ...!

ప్రేమలేఖ రాసా నీకంది ఉంటదీ !
పూలపక్క వేశా అది వేచి ఉంటదీ

4 comments:

E song lo music bhale untundi ...miiruu bhale rasaru :)Radhika(nani)

థాంక్స్ రాధిక గారు :-)

నవల కంటే మూవీయే బావుందనిపించిన సినిమా యిది.ఇందులో సీత పై చిత్రించిన కొన్ని షాట్స్ చూస్తున్నపుడు, సితార లో భానుప్రియ ని కొన్ని వందల మగ చేతులు వెంటాడే దృశ్యం గుర్తొస్తుంది నాకు..హేట్సాఫ్ టు హంసలేఖ..సాంగ్సే కాకుండా బాక్ గ్రౌండ్ మ్యూజిక్ కుడా చాలా హాంటింగ్ గా వుంటుందండీ..

థాంక్స్ శాంతి గారు.. అవునండీ నాకు కూడా ఈ సినిమా చాలా ఇష్టం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.