ఈ పాట ప్రారంభంలో వచ్చే ఫ్లూట్ బిట్ నాకు చాలా ఇష్టం, చిత్రీకరణ సోసోగా ఉంటుంది కానీ పాట సంగీత సాహిత్యాలు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నట్లుగా చాలా బాగుంటాయి నాకు బాగా ఇష్టమైన ఈ పాట మీకోసం. ఆడియో మాత్రం వినాలంటే రాగాలో ఇక్కడ వినండి.
చిత్రం : అభినందన (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, జానకి
మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో…
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
జలకమాడి పులకరించే సంబరంలో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో…
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
జలకమాడి పులకరించే సంబరంలో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో
మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో…
మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మన్మధునితో జన్మ వైరం చాటినపుడో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో…
మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మన్మధునితో జన్మ వైరం చాటినపుడో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో
మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో…
4 comments:
Idi naa favrt song :) (vinadanikI). Okkasari movie chusets pudu chusa. Inkeppudu ee pata chudaledu. Pata vintu aa song video kallamundu kanapadakunda jagratta padats ;)
హహహ థాంక్స్ ఇందు :-) వెల్ వీడియో కొంచెంమన ఊహలకు అందకుండా ఉంటుంది కరెక్టే :-)
పేథాస్ ఐనా..అదే నీవు - అదే నేను..పాట (అభినందన లోదే) చాలా ఇష్టమండీ నాకు..ప్రెజెంట్ చేయగలరా..
థాంక్స్ శాంతి గారు.. తప్పకుండా పోస్ట్ చేస్తానండీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.