బుధవారం, జనవరి 15, 2014

తెలుసా మనసా...

ఒక మంగోలియన్ జానపదగీతం నుండి ఎనిగ్మా ఆరెండిటి నుండి మన కీరవాణి గారు ప్రేరణ పొంది తయారు చేసిన ఈ పాట సంగీతం అద్భుతం, ఒన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ సాంగ్స్ ఎవర్. దీనికి సిరివెన్నెల గారు ఇచ్చిన సాహిత్యం మరింత అద్భుతం. ఈ చక్కని పాట మీకోసం ఈరోజు... ఆడియో మాత్రం వినాలంటే రాగా లో ఇక్కడ వినండి.



చిత్రం : క్రిమినల్ (1994)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర
 
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
 
ప్రతిక్షణం ఊ ఊ ఊ ఊ ఊ నా కళ్ళల్లో నిలిచె నీ రూపం
బ్రతుకులో ఓ ఓ ఓ ఓ అడుగడుగునా నడిపె నీ స్నేహం
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
 
ఆహా..ఆహాఅ...ఆఆ...ఆఆఆఆ..ఆఆ

darling, every breath you take,
every move you make I will be there with you,
what would I do without you?,
I want to love you forever... and ever... and ...ever

ఎన్నడూ ఊ ఊ ఊ ఊ ఊ తీరిపోని రుణముగా ఉండిపో
చెలిమితో ఓ ఓ ఓ ఓ తీగ సాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగినా
మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగ...

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో

 తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో 

విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో

10 comments:

"Ye janmado ee sambandhamu, ye raagamo ee sangeethamu" song from Rakshana also comes into my mind when ever I listen to this song. They resemble each other very much.

$iddharth

కరెక్ట్ గా చెప్పారు సిద్దార్థ్ గారు. నాకు కూడా ఈ రెండు పాటలూ జంటగానే గుర్తొస్తాయి.

విత్ డ్యూ రెస్పెక్ట్స్ టూ నాగార్జున ఫాన్స్..నాగ్ కూడా హీరో యే అనిపించింది ఈ సినిమతోనే సుమండీ..

హహహహ్ శాంతి గారు నాగార్జున అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయేమో జాగ్రత్తండీ :-)

'తూ మిలే దిల్ ఖిలే అవుర్ జీనే కో క్యా చాహియే'
హిందీ తెలుగూ వర్షన్స్ రెండూ ఇష్టం నాకు.
నేను వినే అతి కొద్ది తెలుగు పాటల్లో ఇష్టమయినది ఇది కూడా. కాకపోతే ఇది ఫోర్డ్ బాబాయ్ సినిమాకి కాపీ అని తెలిసి, ఆయన్ని వంద సార్లు చూసిన కళ్ళతో నాగ్ బాబుని చూడలేక సినిమా మాత్రం చూడలేదు. :-)

థాంక్స్ పద్మ గారు :-) హహహ ఫోర్డ్ బాబాయి ఎవరో కాసేపు అర్ధంకాలేదండీ :-))

sharon stone నటించిన "sliver" సినిమా చూడండి. దానిలో టైటిల్స్ పడేప్పుడు వచ్చే సంగీతం....చివరికి రోలింగ్ టైటిల్స్ పడేప్పుడు వచ్చే నేపధ్య ఇన్స్ట్రుమెంటల్ మక్కీ కి మక్కీ దింపి ఈ పాటని తయారుచేశారు కీరవాణి గారు. ఫక్తు కాపీ రాగం.

థాంక్స్ ఫర్ ద కామెంట్ భవాని ప్రసాద్ గారు.. స్లివర్ లో కూడా ఎనిగ్మాలోని మ్యూజిక్ బిట్ నే వాడారండీ దానికి ప్రేరణ మంగోలియన్ జానపద గీతం ఇదే విషయం నేను పోస్ట్ లో కూడా మెన్షన్ చేశాను.

వేణూ శ్రీకాంత్ గారూ...మీరు ఇచ్చిన సమాచారానికి ధన్యవాదాలు. స్లివర్ సినిమాలో కూడా ఇదే ట్యూన్ ఉందన్న నా observation ని తెలియపరిచాను.

రాగలీల సినిమాలో ఒక మంచి మెలోడీ రాజన్-నాగేంద్ర గార్లు స్వరపరచారు "చలికాలమింకా ఎన్నాళ్ళో...తొలిప్రేమ రాగాలెన్నాళ్లో" అన్న పాట. జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చింది. వీలయితే దాన్ని పంచుకోండి. ఇదివరకే పంచుకుంటే దాని లింక్ పంపగలరు.

ఆ పాట ఇంకా షేర్ చేయలేదండీ.. ఈ నెల కొత్తపాటల సిరీస్ రన్ చేస్తున్నాను. ఇవి అయ్యాక తప్పక పంచుకుంటాను. థాంక్స్ ఫర్ ద కామెంట్ భవానీ ప్రసాద్ గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.