హ్మ్.. ప్రేమ చూడడానికి సింపుల్ గా ఉన్నట్లు ఉంటుంది కానీ ప్రేమికులకి ఎన్ని కష్టాలండీ... పాపం ఈ ప్రేమికుడిని చూడండి మనసులో ఎన్ని మధురమైన భావాలున్నా వాటిని ప్రేమలేఖలో అక్షరబద్దం చేయడానికి చదువుకోలేదట అంతమాత్రానా మౌనంగా ఊరుకుంటే అతను ప్రేమికుడెలా అవుతాడు లెండి అందుకే ఏమాత్రం మొహమాట పడకుండా తన ప్రియురాలి సహాయాన్నే తీసుకుని ఆ భావాలని అక్షరాలలో పెట్టించేశాడు. ఆ కథేమిటో మీరూ వినండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.
చిత్రం : గుణ (1991)
రచన : వెన్నెలకంటి
సంగీతం : ఇళయరాజా
గానం : బాలు, శైలజ
ఊ..రాయి..రాయీ...
ఏం రాయాలి?
లెటర్.
ఎవరికి?
నీకు.
నాకా?
నాకు రాయటం రాదు,
ఈ మధ్యనే సంతకం పెట్టడం నేర్చుకున్నా.
వెయిట్ వెయిట్ నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
హహహ I Like it. చెప్పు.
నా ప్రియా. ప్రేమతో. నీకు. నీకు. నేను రాసే.. రాసే.
నేను. రాసే. ఉత్తరం.
ఉత్తరం లెటర్ ఛా. కాదు ఉత్తరమే అని రాయి. చదువు.
కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే.
పాటలా మార్చి రాసావా? నేను కూడా మారుస్తా.
మొదట నా ప్రియా అన్నాను కదా!
అక్కడ ప్రియతమా అని మార్చుకో.
ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా?
ఇక్కడ నేను క్షేమం.
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే.
ఆహా ఒహో
ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతోంది.
కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే !!!
ఊహలన్ని పాటలే కనుల తోటలో. అదే!
తొలి కలల కవితలే మాట మాటలో. అదే!
ఆహా! బ్రహ్మాండం కవిత కవిత పాడు
కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఊహలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో
ఓహో కమ్మని నీ ప్రేమలేఖనే రాసింది హృదయమే
లాలలా లాలాల లాలలాలాలలా లాలాల లాలలా
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
లాలలా లాలాల లాలలాలాలలా లాలాల లాలలా
నాకు తగిలిన గాయమదే చల్లగా మానిపోతుంది.
అదేమిటో నాకు తెలియదు,ఏం మాయో తెలియదు.
నాకేమీ కాదసలు. ఇది కూడా రాసుకో.
అక్కడక్కడా పువ్వు నవ్వు ప్రేమ అలాంటివేస్కోవాలి.. ఆ...
ఇదిగో చూడు.
నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది.
నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు.
ఉమా దేవి. దేవి ఉమా దేవి.
అది కూడా రాయాలా? అహహా..... అది ప్రేమ.
నా ప్రేమెలా చెప్పాలో తెలియకిదౌతుంటే ఏడుపొస్తుంది.
కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా
బాధ పెడుతున్నాననుకున్నప్పుడు
వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. హహ్హ......
మనుషులర్థం చేసుకునేందుకిది మాములు ప్రేమ కాదు.
అగ్ని లాగ స్వచ్ఛమైనది.
గుండెల్లొ గాయమేమో చల్లంగ మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే...
ఎంత గాయమైనగానీ నా మేనికేమిగాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే...
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగు తున్నదీ....
నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితె తాళనన్నదీ....
మనుషులెరుగలేరు
మామూలు ప్రేమ కాదు అగ్నికంటె స్వచ్ఛమైనదీ....
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా...
ఉమాదేవిగా శివుని అర్థభాగమై నాలోన నిలువుమా...
శుభ లాలి లాలి జో లాలి లాలి జో
ఉమాదేవి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా...
నా హృదయమా...
థాంక్స్ టు http://www.yugandroid.in/songs-lyrics/guna/priyathama.html
4 comments:
songs toa paatu photoas kudaa chaalaa baaguntunnaayandi ..radhika (nani)
థాంక్స్ రాధిక గారు :-)
స్త్రీ చుట్టూ సమాజం అల్లిన చీకటిని చూసి అలిసి పోయిన గుణ..ఓంకారం లాంటి పవిత్రమైన ప్రేమ మయిని గుండె నిండా నింపుకోవాలని తపన పడే గుణ..ఈ సినిమా చూసిన ప్రతీ సారీ, వెచ్చటి కన్నీరు పెదవులని స్నేహం గా పలకరిస్తుంది..వీలైతే ఇందులోని శాంభవి అనే సాంగ్ ని ప్రెజెంట్ చేయండి వేణూజీ..ప్రాణమంటి పాట అది..
థాంక్స్ శాంతి గారు, రెండు లైన్స్ లో గుణ గురించి చాలా బాగా చెప్పారండీ... తప్పకుండా శాంభవి పాట కూడా పోస్ట్ చేస్తాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.