శనివారం, అక్టోబర్ 30, 2010

తెలుగు హనుమాన్ చాలీసా

బహుశా సులువుగా అర్ధమవడం వలనో లేదా చిన్నతనం నుండీ ఎక్కువగా విన్నందువలనో నాకు హనుమాన్ చాలీసా అంటే ఎమ్ యస్ రామారావు(మోపర్తి సీతారామారావు)గారు పాడిన తెలుగు హనుమాన్ చాలీసా మాత్రమే గుర్తొస్తుంది. ఇతరములు ఏవి విన్నా ఇంత భక్తిభావం కానీ తదాత్మ్యతకు లోనవడం కాని జరగవు. ఆయన వైవిధ్యమైన గొంతు, సన్నివేశానికి తగ్గట్లుగా స్వరాన్ని స్వల్పంగా మార్చి పాడే విధానం అంతా అద్భుతం. ఆ గాన మాధుర్యాన్ని చవి చూసి హనుమాన్ భక్తి పారవశ్యంలో మీరూ ఓలలాడండి... 


ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరాం భూయో భూయో నమామ్యహం
హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహ బలహః
రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః
ఉధధిక్రమణ శ్చైవ సీతా శోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతచ దశగ్రీవస్య దర్పః
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషత
తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్

శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాథక శరణములు

బుద్దిహీనతను కల్గిన తనువులు
బుద్భుదములని తెలుపు సత్యములు

||శ్రీ హనుమాను||

జయహనుమంత ఙ్ఞాన గుణవందిత
జయ పండిత త్రిలోక పూజిత

రామదూత అతులిత బలధామ
అంజనీ పుత్ర పవన సుతనామ

ఉదయభానుని మధుర ఫలమని
భావన లీల అమృతమును గ్రోలిన

కాంచన వర్ణ విరాజిత వేష
కుండలమండిత కుంచిత కేశ 

||శ్రీ హనుమాను||

రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజపదవి సుగ్రీవున నిలిపి

జానకీ పతి ముద్రిక దోడ్కొని
జలధిలంఘించి లంక జేరుకొని

సూక్ష్మ రూపమున సీతను జూచి
వికట రూపమున లంకను గాల్చి

భీమ రూపమున అసురుల జంపిన
రామ కార్యమును సఫలము జేసిన

||శ్రీ హనుమాను||

సీత జాడగని వచ్చిన నిను గని
శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని

సహస్ర రీతుల నిను కొనియాడగ
కాగల కార్యము నీపై నిడగ

వానర సేనతో వారధి దాటి
లంకేశునితో తలపడి పోరి

హోరు హోరునా పోరు సాగిన
అసురసేనల వరుసన గూల్చిన

||శ్రీ హనుమాను||

లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ
సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత

రామ లక్ష్మణుల అస్త్రధాటికీ
అసురవీరులు అస్తమించిరి

తిరుగులేని శ్రీ రామ బాణము
జరిపించెను రావణ సంహారము

ఎదురిలేని ఆ లంకాపురమున
ఏలికగా విభీషణు జేసిన

||శ్రీ హనుమాను||

సీతారాములు నగవుల గనిరి
ముల్లోకాల హారతులందిరి

అంతులేని ఆనందాశృవులే
అయోధ్యాపురి పొంగిపొరలె

సీతా రాముల సుందర మందిరం
శ్రీకాంతుపదం నీ హృదయం

రామ చరిత కర్ణామృత గాన
రామ నామ రసామృతపాన

||శ్రీ హనుమాను||

దుర్గమమగు ఏ కార్యమైనా
సుగమమే యగు నీకృపజాలిన

కలుగు సుఖములు నిను శరణన్న
తొలగు భయములు నీ రక్షణ యున్న

రామ ద్వారపు కాపరివైన నీ
కట్టడి మీర బ్రహ్మాదుల తరమా

భూత పిశాచ శాకిని ఢాకిని
భయపడి పారు నీనామజపము విని

||శ్రీ హనుమాను||

ధ్వజావిరాజా వజ్ర శరీరా
భుజ బల తేజా గధాధరా

ఈశ్వరాంశ సంభూత పవిత్రా
కేసరీ పుత్ర పావన గాత్ర

సనకాదులు బ్రహ్మాది దేవతలు
శారద నారద ఆదిశేషులు

యమ కుబేర దిగ్పాలురు కవులు
పులకితులైరి నీ కీర్తి గానముల

||శ్రీ హనుమాను||

సోదరభరత సమానా యని
శ్రీ రాముడు ఎన్నిక గన్న హనుమా

సాధులపాలిట ఇంద్రుడవన్నా
అసురుల పాలిట కాలుడవన్నా

అష్టసిద్ది నవ నిధులకు దాతగ
జానకీమాత దీవించెనుగా

రామ రసామృత పానము జేసిన
మృత్యుంజయుడవై వెలసినా

||శ్రీ హనుమాను||

నీనామ భజన శ్రీరామ రంజన
జన్మ జన్మాంతర ధుఃఖ బంజన

ఎచ్చటుండినా రఘువరదాసు
చివరకు రాముని చేరుట తెలుసు,

ఇతర చింతనలు మనసున మోతలు
స్థిరముగ మారుతి సేవలు సుఖములు

ఎందెందున శ్రీరామ కీర్తన
అందందున హనుమాను నర్తన

||శ్రీ హనుమాను||

శ్రద్దగ దీనిని ఆలకింపుమా
శుభమగు ఫలములు కలుగు సుమా

భక్తిమీరగ గానము చేయగ
ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగ,

తులసీదాస హనుమాన్ చాలిసా
తెలుగున సుళువుగ నలుగురు పాడగ

పలికిన సీతారాముని పలుకున
దోషములున్న మన్నింపుమన్న

||శ్రీ హనుమాను||

మంగళ హారతి గొను హనుమంత
సీతారామ లక్ష్మణ సమేత
నా అంతరాత్మ నిలుమో అనంత
నీవే అంతా శ్రీ హనుమంత

ఓం శాంతిః శాంతిః శాంతిః

8 comments:

మా ఇంట్లో రోజూ ప్రభాత సమయం దాదాపుగా దీనితోనే మొదలవుతుంది. నాకు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాడిన చాలీసా చాలా ఇష్టం! సంకీర్తన ఈ రెండూ విని "సుబ్బు లక్ష్మి గారు పాడిన చాలీసా హనుమాన్ "పాడవా ప్లీజ్" అని బతిమిలాడితే పాడినట్లుందని, ఎమ్మెస్ రామారావు గారేమో హనుమాన్ ని ప్లీజ్ చేసే విధంగా, స్వీట్ గా పాడారనీ తేడా విశ్లేషించింది. నాకు ఒక్క క్షణం కళ్ళు తిరిగాయి.తర్వాత ఎప్పుడు విన్నా ఈ విశ్లేషణ గుర్తొస్తూ ఉంటుంది.

Any way, I love this telugu chalisa too!

Thanks for sharing!

శోభ గారు నెనర్లు, మీకు కూడా హనుమంతుడు శుభఫలితాలివ్వాలని కోరుకుంటున్నాను.

సుజాత గారు నెనర్లు, చిన్నారి సంకీర్తనకు ఆశీస్సులు, నిజంగా చాలా బాగా చెప్పింది. సుబ్బలక్ష్మిగారిది నేను వినలేదు కానీ రామారావు గారి గురించి మాత్రం చాలా కరెక్ట్ గా చెప్పింది.

ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

naaku kooda telugu hanuman chalisa vinadam ishtamandi. naaku paadatam kooda vachhandi.thanx for sharing;

థాంక్స్ ఫర్ ద కామెంట్. అజ్ఞాతగారు. మీకు పాడటం వచ్చని తెలుసుకోడం సంతోషం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.