ఆదివారం, ఫిబ్రవరి 28, 2010

టాటా ! వీడుకోలూ !!

కొన్ని అనివార్య కారణాల వలన నా ఈ బ్లాగుకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించదలచాను. ఒక ఐదారు నెలల పాటు ఈ బ్లాగులో ఏ విధమైన కొత్త టపాలు ప్రచురించను. బ్లాగ్ ఓపెన్ యాక్సెస్ తోనే ఉంటుంది. ఇదివరకు ప్రచురించిన టపాలు చూడతలచిన వారు వచ్చి చూడవచ్చు. వెళ్ళేముందు సంధర్బశుద్ది లేకపోయినా నాకు టాటా అన్న పదం వినగానే గుర్తొచ్చే ఓ పాట గురించి చెప్తాను.

నాకు పాత సినిమా పాటలు పరిచయమైన కొత్తలో ఘంటసాల మాష్టారి పాటలు అంటే మా ఊరి టెంట్ హాల్ లో వేసే నమో వెంకటేశ, ఏడుకొండలవాడా లాంటి భక్తిపాటలు, పాడుతా తీయగా, కొండగాలి తిరిగిందీ గుండె ఊసులాడింది లాంటి మధురమైన గీతాలు మాత్రమే అని ఓ అభిప్రాయం ఉండేది. మొదటి సారి ఈ పాట విన్నపుడు కెవ్ మని కేకేసాను :-) ఎలాంటి మూడ్ అయినా నేను మెప్పించగలనోయ్ అని స్వయానా ఆయనే నాతో అన్నట్లు అనిపించింది. బాపు రమణ గారు ఏం చెప్పి ఒప్పించారో కానీ మొత్తానికి తెలుగు ప్రేక్షకులకు ఓ ప్రత్యేకమైన గీతం దొరికింది. ప్రియురాలి వలపులకన్నా.. నునువెచ్చనిదేదీ లేదని లైన్ లో నునువెచ్చని అనే పదం ఆయన పలకడం వింటే మనకు ఆ వెచ్చదనం అనుభూతికి వస్తుంది అనడం అతిశయోక్తికాదేమో. ఇచ్చుటలో ఉన్నహాయి వేరెచ్చటనూ లేదని లాటి ఆరుద్ర గారి ఛమక్కులకు కొదవలేదు. ఇక అక్కినేని గారి తాగుబోతు నటన గురించి చెప్పేదేముంది ఇప్పుడు చూస్తే కాస్త నవ్వొస్తుంది కానీ అప్పట్లో కేక :-) హ హ సరే మరి ఈ పాట మీరుకూడా ఓ సారి చూసి/విని ఎంజాయ్ చేసేయండి. కొంత విరామం తర్వాత మళ్ళీ కలుద్దాం.చిత్రం : బుద్దిమంతుడు
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల

టాటా.. వీడుకోలు... గుడ్ బై ఇంక సెలవు
టాటా.. వీడుకోలు... గుడ్ బై ఇంక సెలవు
తొలినాటి స్నేహితులారా... చెలరేగే కోరికలారా.. హోయ్..
తొలినాటి స్నేహితులారా... చెలరేగే కోరికలారా...
టాటా వీడుకోలు.. గుడ్ బై ఇంక సెలవు..
టాటా వీడుకోలూ...

ప్రియురాలి వలపులకన్నాఆ ఆ.. నును వెచ్చనిదేదీ లేదని...
ప్రియురాలి వలపులకన్నాఆ ఆ.. నును వెచ్చనిదేదీ లేదని...
నిన్నను నాకు తెలిసింది... ఒక చిన్నది నాకు తెలిపింది...
ఆ... ప్రేమ నగరుకే పోతాను... పోతాను... పోతాను...
ఈ... కామ నగరుకు రాను... ఇక రాను...

టాటా.. వీడుకోలు గుడ్ బై.. ఇంక సెలవు
టాటా.. వీడుకోలూ...

ఇచ్చుటలో ఉన్న హాయీ...ఈ.. వేరెచ్ఛటను లేనే లేదనీ...
ఇచ్చుటలో ఉన్న హాయీ...ఈ.. వేరెచ్ఛటను లేనే లేదనీ...
లేటుగా తెలుసుకున్నాను... నా లోటును దిద్దుకున్నాను
ఆ స్నేహ నగరుకే పోతాను... పోతాను... పోతాను...
ఈ మోహ నగరుకు రాను... ఇక రాను...

టాటా.. వీడుకోలు.. గుడ్ బై.. ఇంక సెలవు
టాటా.. వీడుకోలూ...

మధుపాత్రకెదలో ఇంక.. ఏమాత్రం చోటూ లేదనీ...
మధుపాత్రకెదలొ ఇంక.. ఏమాత్రం చోటూ లేదనీ...
మనసైన పిల్లే చెప్పిందీ...
మనసైన పిల్లే చెప్పిందీ...
నా మనసంతా తానై నిండింది
నా మనసంతా తానై నిండింది
నే... రాగ నగరుకే పోతాను...
అనురాగ నగరుకే పోతాను...

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.