దేవాంతకుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : దేవాంతకుడు (1960)
సంగీతం : అశ్వత్థామ
సాహిత్యం : ఆరుద్ర
గానం : పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి
ఎంత మధురసీమ ప్రియతమా
సంతతము మనమిచటే…
సంతతము మనమిచటే సంచరించుదామా
ఎంత మధురసీమ ప్రియతమా
వినువీధుల తారకలే
విరజాజుల మాలికలై
వినువీధుల తారకలే
విరజాజుల మాలికలై
కనులముందు నిలువగా
కనులముందు నిలువగా
నీ కురులలోన ముడిచెదనే
సంగీతం : అశ్వత్థామ
సాహిత్యం : ఆరుద్ర
గానం : పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి
ఎంత మధురసీమ ప్రియతమా
సంతతము మనమిచటే…
సంతతము మనమిచటే సంచరించుదామా
ఎంత మధురసీమ ప్రియతమా
వినువీధుల తారకలే
విరజాజుల మాలికలై
వినువీధుల తారకలే
విరజాజుల మాలికలై
కనులముందు నిలువగా
కనులముందు నిలువగా
నీ కురులలోన ముడిచెదనే
ఎంత మధురసీమ ప్రియతమా
గగన గంగ అలలలోన
కదలియాడు తామరలే
గగన గంగ అలలలోన
కదలియాడు తామరలే
కరములందు వచ్చి చేర
కరములందు వచ్చి చేర
నీ చరణ పూజచేయుదునా
నీ చరణ పూజచేయుదునా
ఎంత మధురసీమ ప్రియతమా
ఎటుచూచిన అందమే
చిందును మకరందమే
ఎటుచూచిన అందమే
చిందును మకరందమే
ఈ వన్నెల వెన్నెలలో
ఈ వన్నెల వెన్నెలలో
ఓలలాడి సోలుదమా
ఎంత మధురసీమ ప్రియతమా
కమ్మని ఈ వనమందున
కలసిమెలసి పాడుదమా
కమ్మని ఈ వనమందున
కలసిమెలసి పాడుదమా
కల్పవృక్ష ఛాయలోన
కల్పవృక్ష ఛాయలోన
కాపురమే చేయుదమా
ఎంత మధురసీమ ప్రియతమా
2 comments:
నైస్ పిక్..
థాంక్స్ శాంతి గారు...
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.