శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శ్రీ వే౦కటేశ్వర మహత్య౦ (1960)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : ఆత్రేయ
గానం : ఘంటసాల, సుశీల
కలగా.. కమ్మని కలగా..
మన జీవితాలు మనవలెగా..
కలగా.. కమ్మని కలగ..
అనురాగమె జీవన జీవముగా..
ఆనందమె మనకందముగా...
కలగా.. కమ్మని కలగ..
రాగవశమున మేఘమాలిక
మలయ పవనుని కలిసి తేలదా
ఆ.. ఆ... ఆ.. ఆ...
రాగవశమున మేఘమాలిక
మలయ పవనుని కలిసి తేలదా..
కొండను తగిలి గుండియ కరిగి
నీరై ఏరై పారునుగా
కలగా.. కమ్మని కలగా
మన జీవితాలె ఒక కలగా
కలగా.. కమ్మని కలగా
వెలుగు చీకటుల కలబోసిన...
యీ కాలము చేతిలో
కీలుబొమ్మలము
భావనలోనే జీవనమున్నది..
మమతే జగతిని నడుపునది..
మమతే జగతిని నడుపునది..
కలగా... కమ్మని కలగా...
తేటి కోసమై తేనియ దాచే
విరికన్నియకా సంబరమేమో?
వేరొక విరిని చేరిన ప్రియుని
కాంచినప్పుడా కలత యేమిటో?
ప్రేమకు శోకమె ఫలమేమో
రాగము.. త్యాగము.. జతలేమో
కలగా.. కమ్మని కలగా...
ఆ.. ఆ... ఆ.... ఆ...ఆ.....ఆ...
ఆ.. ఆ... ఆ.... ఆ...ఆ.....ఆ...
ఆ.. ఆ... ఆ.... ఆ...ఆ.....ఆ...
కలగా.. కమ్మని కలగా...
2 comments:
యెంత అందమైన జంట..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.