శనివారం, ఫిబ్రవరి 02, 2019

కులాసా రాదోయ్ రమ్మంటే...

అన్నపూర్ణ చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.

చిత్రం : అన్నపూర్ణ (1960)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
రచన : ఆరుద్ర
గానం : జిక్కి(కృష్ణవేణి)

కులాసా రాదోయ్ రమ్మంటే
మజాకా కాదోయ్ వలపంటే
ఖలేజా అంటూ వుండాలోయ్ రాజా
అదుంటే ఎపుడూ నిన్ను ఎడబాయనోయ్

కులాసా రాదోయ్ రమ్మంటే
మజాకా కాదోయ్ వలపంటే
ఖలేజా అంటూ వుండాలోయ్ రాజా
అదుంటే ఎపుడూ నిన్ను ఎడబాయనోయ్


గులాబీ చక్కదనం
జిలేబీ తియ్యదనం
చలాకీ సొగసుల లేతదనం
కలసిన యవ్వనం
గులాబీ చక్కదనం
జిలేబీ తియ్యదనం
చలాకీ సొగసుల లేతదనం
కలసిన యవ్వనం
నీదే చేసెద అందమూ
నీకూ నాకూ బంధమూ..
పోనోయ్.. పొమ్మంటే..
నీదే చేసెద అందమూ
నీకూ నాకూ బంధమూ..
పోనోయ్.. పొమ్మంటే..

కులాసా రాదోయ్ రమ్మంటే
మజాకా కాదోయ్ వలపంటే
ఖలేజా అంటూ వుండాలోయ్ రాజా
అదుంటే ఎపుడూ నిన్ను ఎడబాయనోయ్ 

  
వయ్యారం ఒలికిస్తా
హుషారు కలిగిస్తా
వరించి నీచే వలపిస్తా
వోహో అనిపిస్తా
వయ్యారం ఒలికిస్తా
హుషారు కలిగిస్తా
వరించి నీచే వలపిస్తా
వోహో అనిపిస్తా
రావాలనుకుని వచ్చావు
యిక పోవాలన్నా పోనీను
మనసోయ్ నీవంటే
రావాలనుకుని వచ్చావు
యిక పోవాలన్నా పోనీను
మనసోయ్ నీవంటే

కులాసా రాదోయ్ రమ్మంటే
మజాకా కాదోయ్ వలపంటే
ఖలేజా అంటూ వుండాలోయ్ రాజా
అదుంటే ఎపుడూ నిన్ను ఎడబాయనోయ్
 


2 comments:

ప్రేమించడం..ప్రేమని గెలిపించుకోవడం రెండూ స్వీటే..

బాగా చెప్పారండీ.. అందుకే మరి ఇన్ని ప్రేమ కథలు.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.