బుధవారం, ఫిబ్రవరి 06, 2019

అందానికి అందం నేనే...

చివరకు మిగిలేది చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. సరెగమా యూట్యూబ్ ఛానల్లో క్లియర్ ఆడియో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : చివరకు మిగిలేది (1960)
సంగీతం : అశ్వద్ధామ
సాహిత్యం : మల్లాది రామకృష్ణ శాస్త్రి
గానం : జమునారాణి

అందానికి అందం నేనే
జీవన మకరందం నేనే
అందానికి అందం నేనే
జీవన మకరందం నేనే
తీవెకు పూవును నేనే
పూవుకు తావిని నేనే
తీవెకు పూవును నేనే
పూవుకు తావిని నేనే
ధరణి అమరధామమయే
ఆనందము నేనే

అందానికి అందం నేనే
జీవన మకరందము నేనే


వాలు కనుల చూపులే
చెంగల్వ తోరణాలు
వాలారు చిరునవ్వులే..లే..
వన్నె విరుల హారాలు
నా మేనే..ఏ..మెరుపు తీవ
నగు మోమే..ఏ..చందమామ
నా మేనే మెరుపు తీవ
నగు మోమే చందమామ
నవరసాల సమ్మోహ
సమ్మేళన నేనే

అందానికి అందం నేనే
జీవన మకరందము నేనే


మలయానిల..లాలనలో
పదే పదే..పరవశమై
మలయానిల..లాలనలో
పదే పదే..పరవశమై
గానమేలు ఎలకోయిల
గళ మధురిమ నేనే
గానమేలు ఎలకోయిల
గళ మధురిమ నేనే
మాయని తియ్యందనాలు
మన వరాలే
అవలీలగా..జగమేలగా
అవలీలగా..జగమేలగా
నవచైతన్య సమ్మోహ
సమ్మేళన నేనే

అందానికి అందం నేనే
జీవన మకరందం నేనే
అందానికి అందం నేనే
జీవన మకరందం నేనే 


2 comments:

ఈ మూవీ చూసినప్పుడు మనసు గోదావరిలా ఐపోయింది..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.