పాత పాటలు అని పిలవాలంటే మనసొప్పకపోయినా అప్పటి పాటలు వింటూంటే కలిగే హాయైన అనుభూతే వేరుగా ఉంటుంది. అందుకే అవి కాలంతో మరుగున పడకుండా ఇప్పటికీ నిలిచి ఉన్నాయ్ అలాంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్ కొన్నింటిని ఈ నెల తలచుకుందాం. ముందుగా అభిమానం చిత్రంలోని ఒక చక్కని పాటతో ఈ సిరీస్ మొదలు పెడదాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అభిమానం (1960)
సంగీతం : ఘంటసాల
రచన : శ్రీశ్రీ
గానం : ఘంటసాల, జిక్కి
ఆహాహా హాహాహా... ఆహాహా హాహాహా...
ఊఁహూఃఊఁ.. ఊఁహూఃఊఁ..
వలపు తేనెపాట.. తొలివయసు పూలతోట
పరువాల చిన్నెల సయ్యాట
వలపు తేనెపాట.. తొలివయసు పూలతోట
పరువాల చిన్నెల సయ్యాట
వలపించి వలచు చోటా.. నే ప్రేమ పసిడితోటా
ఓ ఓ ఓ ఓ... ఓహోహో ఓ ఓ ఓ...
వలపించి వలచు చోటా.. నే ప్రేమ పసిడితోటా
కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట
కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట
వలపు తేనెపాట.. తొలివయసు పూలతోట
పరువాల చిన్నెల సయ్యాట
నిలవాలిలే హమేషా..ఆ.. ఈనాటి ప్రేమభాషా..ఆ..
ఓ ఓ ఓ ఓ... ఓహోహో ఓ ఓ ఓ...
నిలవాలిలే హమేషా..ఆ.. ఈనాటి ప్రేమభాషా..ఆ..
ప్రేమ పెళ్ళి ముచ్చటలంటే కాదులే తమాషా
ప్రేమ పెళ్ళి ముచ్చటలంటే కాదులే తమాషా
వలపు తేనెపాట తొలివయసు పూలతోట
పరువాల చిన్నెల సయ్యాట
పరువాల చిన్నెల సయ్యాట
ఆహహా ఆహహా హాహ హాహాహహా..హాహాహహా
2 comments:
ఓ..ఆ పాత మధురాలన్నమాట..
అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.