మంగళవారం, ఫిబ్రవరి 05, 2019

ఓ నెలరాజా వెన్నెల రాజా...

భట్టి విక్రమార్క చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భట్టి విక్రమార్క (1961)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : అనిశెట్టి సుబ్బారావు
గానం : ఘంటసాల, సుశీల

ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలోయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్
ఓ నెలరాజా

చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో
ఓఓఓఓఓ...ఓఓఓఓఓఓ...
చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో
కొంటె చుపూ నీకేల చంద్రుడా
నా వెంటనంటి రాకోయీ చంద్రుడా

ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలోయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్
ఓ నెలరాజా

ఆఆఆఆఆఆ.... ఆఆఆఆఆఆఆ...
కలువల చిరునవ్వులే కన్నెల నునుసిగ్గులే
ఓఓఓఓఓ...ఓఓఓఓఓఓ...
కలువల చిరునవ్వులే కన్నెల నునుసిగ్గులే
వెంటనంటి పిలిచినపుడు చంద్రుడా
వాని విడువ మనకు తరమవున చంద్రుడా

ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలేయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్
ఓ నెలరాజా

లేత లేత వలపులే పూత పూయు వేళలో
కలవరింత లెందుకోయి చంద్రుడా
నా చెలిమి నీదే కాదటోయి చంద్రుడా
కలవరింత లెందుకోయి చంద్రుడా..
నా చెలిమి నీదే కాదటోయి చంద్రుడా..

ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలోయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్
ఓ నెలరాజా

2 comments:

చందమామంత అందంగా ఉన్నారు యన్.టి.ఆర్..

కదండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.