శుక్రవారం, ఫిబ్రవరి 22, 2019

నిండుపున్నమి నెలా...

రుణానుబంధం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రుణానుబంధం (1960)
సంగీతం : ఆదినారాయణరావ్ 
సాహిత్యం : సముద్రాల
గానం : P.సుశీల, S.జానకి

అహా..అహా...అహా..హా..హా..హా..
నిండు పున్నమి నెలా..అందె తీయని కలా
కోరిన వారే..చేరువైనారే..హాయ్..హాయ్..హాయ్..
ఈనాడే...హాయ్..హాయ్...హాయ్...ఈనాడే......

ఆ...ఆ...ఆ...ఆ...
నిండుపున్నమి వెన్నెల సుడిగుండమాయే నాకలా
నిండుపున్నమి వెన్నెల సుడిగుండమాయే నాకలా
నిండుపున్నమి వెన్నెలా....

పేదమనసు దోచెనే..అపవాదులెన్నో వేసేనే..
పేదమనసు దోచెనే..అపవాదులెన్నో వేసేనే..
ఏది నిజమో ఎరుగలేక..బ్రతుకు చీకటిచేసేనే..
నిండుపున్నమి వెన్నెల సుడిగుండమాయే నాకలా
నిండుపున్నమి వెన్నెలా....

జంట నీవై వెంట నేనై..సాగిపోదము బావా..
మింటిమీద చందమామా..అంటి చూద్దము రావా..
వయసు నీదోయ్ వలపునీదోయ్..హాయ్..హాయ్...హాయ్..
ఈరేయీ...హాయ్...హాయ్...హాయ్...ఈరేయీ...
నిండుపున్నమి నెలా....

ఆ...ఆ...ఆ..
బాధలన్నీ నేటికిటుల..నీటిపాలాయే...
ఆశలన్నీ గాలిమేడై..నేల పాలాయే...
మాసిపోని జ్ఞాపకాలు..గాయమై మది మిగిలెనే..
నిండుపున్నమి వెన్నెల సుడిగుండమాయే నాకలా
నిండుపున్నమి వెన్నెలా....

నిండుపున్నమి నెలా...పండే తీయని కలా...
కోరిన వారే..చేరువైనారే..హాయ్..హాయ్..హాయ్..
ఇనాడే...హాయ్...హాయ్...హాయ్...ఇనాడే...
నిండుపున్నమి నెలా...అహా..హా...అహా...హా...
హా..హా..హా..హా..ఓహో..ఓహో..ఓహో...హో...


2 comments:

పాత సినిమాల్లో వెన్నెల పాటలు చాలా హాయిగా ఉంటాయి..ఇక విజయా వారి జాబిలి పాటలైతే అద్భుతహా..

అవునండీ విజయావారి సినిమాలు పాటలు మర్చిపోలేం.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.