మంగళవారం, ఫిబ్రవరి 26, 2019

నీలి వెన్నెల కాయసాగే...

విమల చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : విమల (1960)
సంగీతం : ఎస్.ఎమ్.సుబ్బయ్య నాయుడు
సాహిత్యం : ముద్దు కృష్ణ
గానం : జయలక్ష్మి

నీలి వెన్నెల కాయసాగే
చల్లగాలి తగిలి తీగలూగే
నీలి వెన్నెల కాయసాగే
చల్లగాలి తగిలి తీగలూగే


నాలో కలలు చెలరేగే
నను గనవిదేరా ప్రేమ మీరా
నాలో కలలు చెలరేగే
నను గనవిదేరా ప్రేమ మీరా

గుండె దడ దడలు మీరి
నినే నిండు మనసు నను కోరి
గుండె దడ దడలు మీరి
నినే నిండు మనసు నను కోరి

కన్నుతళుకులకు నన్నే
మరిచినాను కదరా మది చెదరా
కన్నుతళుకులకు నన్నే
మరిచినాను కదరా మది చెదరా

నీలి వెన్నెల కాయసాగే
చల్లగాలి తగిలి తీగలూగే


చక్కదనము సొమ్ము నేనే
నీకే చిక్కి సమస్తమమ్మీనానే
చక్కదనము సొమ్ము నేనే
నీకే చిక్కి సమస్తమమ్మీనానే

ఒక్క పలుకుతోనే చిక్కు తీరునురా
ఒక్క పలుకుతోనే చిక్కుతీరగ
నా దిక్కే  చూడవేరా
ఒక్క పలుకుతోనే చిక్కుతీరగ
నా దిక్కే  చూడవేరా

మనసు మనసు పెనవేసి
మన మమతలొకటిగను చేసి
మనసు మనసు పెనవేసి
మన మమతలొకటిగను చేసి

కలలు కనిన మన వలపు
ఫలములను కనరా సుఖమగురా
కలలు కనిన మన వలపు
ఫలములను కనరా సుఖమగురా

నీలి వెన్నెల కాయసాగే
చల్లగాలి తగిలి తీగలూగే
నాలో కలలు చెలరేగే
నను గనవిదేరా ప్రేమ మీరా 


2 comments:

సశాస్త్రీయమైన ప్రేమ పాట..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.