మంగళవారం, ఫిబ్రవరి 19, 2019

నగవు చిలుకుమా...

పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం (1960)
సంగీతం : టి.జి.లింగప్ప  
సాహిత్యం : సముద్రాల  
గానం : జానకి   

ఆఆఅ...ఆఆఆఆ..ఆఆఅ...
నగవు చిలుకుమా 
నగవు చిలుకుమా
నగవు చిలుకుమా
చిన్నారి రాజా
నా మది చల్లగా
నగవు చిలుకుమా

రాతి బొమ్మలా
నిలవ కారణమేమో
నీదు సిరులన్నీ
నిలువు దోపులాయెనా
రాతి బొమ్మలా
నిలవ కారణమేమో
నీదు సిరులన్నీ
నిలువు దోపులాయెనా
అలుకా మౌన యోగమా
అభినవ రాజ ఠీవియా
అలుకా మౌన యోగమా
అభినవ రాజ ఠీవియా
తరితీపి విరితేనె
విందులు సేతురా

నగవు చిలుకుమా
ఆఅ..ఆఆఆఅ...
నగవు చిలుకుమా
ఆఆఅ.. 

నవ్విన ముత్యాలు
ధరను రాలునా
చివురు కెమ్మోవి
చిలుక కొరికి వేయునా
నవ్విన ముత్యాలు
ధరను రాలునా
చివురు కెమ్మోవి
చిలుక కొరికి వేయునా
తరుగని ఉదర శూలయో
ననుగని పగలు పోయెదో
తరుగని ఉదర శూలయో
ననుగని పగలు పోయెదో
అంజూర దానిమ్మ
కానుక సేతురా

నగవు చిలుకుమా 
నగవు చిలుకుమా
నగవు చిలుకుమా
చిన్నారి రాజా
నా మది చల్లగా
నగవు చిలుకుమా 


2 comments:

పూర్తిగా పిల్లల మూవీ..అద్భుతం గా నటించారందరూ..

ఓహ్ అవునా.. నేను సినిమా చూడలేదు శాంతి గారు.. కానీ ఈ పాట చూసి భలే ముచ్చటగా చేశారు పిల్లలు ఇద్దరూ అనుకున్నాను. థాంక్స్ ఫర్ ద కామెంట్ అండీ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.