శుక్రవారం, ఫిబ్రవరి 15, 2019

పొగరుమోతు పోట్లగిత్తరా...

నమ్మిన బంటు చిత్రంలోని ఒక సరదా ఐన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నమ్మిన బంటు (1960)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం : కొసరాజు
గానం : ఘంటసాల

కన్నుమిన్ను కానరాని గాలితెరపు గిత్తరా
పట్టుకుంటే మాసిపోయే పాలపళ్ల గిత్తరా
అరెరెరెరెరెరే... ఒంటిమీద చేయి వేస్తే
ఉలికిపడే గిత్తరా... ఆ...

హాయ్... పొగరుమోతు పోట్లగిత్తరా
ఓరయ్య... దీని చూపే సింగారమౌనురా
ఓరయ్య... దీని రూపే బంగారమౌనురా

పొగరుమోతు పోట్లగిత్తరా
ఓరయ్య... దీని చూపే సింగారమౌనురా
ఓరయ్య... దీని రూపే బంగారమౌనురా


ముందుకొస్తే ఉరిమి కొమ్ములాడిస్తుంది
ఎనక్కొస్తే ఎగిరి కాలు ఝాడిస్తుంది...
ఓహో... ఓ... హోయ్...
ముందుకొస్తే ఉరిమి కొమ్ములాడిస్తుంది
ఎనక్కొస్తే ఎగిరి కాలు ఝాడిస్తుంది...
విసురుకుంటూ కసురుకుంటూ
ఇటూ అటూ అటూ ఇటూ డిర్‌‌‌రరర్‌ర్..
కుంకిళ్లు పెడుతుంది కుప్పిగంతులేస్తుంది

హాయ్... పొగరుమోతు పోట్లగిత్తరా
ఓరయ్య... దీని చూపే సింగారమౌనురా
ఓరయ్య... దీని రూపే బంగారమౌనురా


అదిలిస్తే అంకె వేయు బెదురుమోతు గిత్తరా
అరెరెరెరెరే కదిలిస్తే గంతులేసి కాండ్రుమనే గిత్తరా
దీని నడుముతీరు చూస్తుంటే నవ్వు పుట్టుకొస్తోంది
నడక జోరు చూస్తుంటే ఒడలు పులకరిస్తోంది
అహ...
నడుముతీరు చూస్తుంటే నవ్వు పుట్టుకొస్తోంది
నడక జోరు చూస్తుంటే ఒడలు పులకరిస్తోంది
వన్నెచిన్నెల రాణి ఇవ్వాళ మంచిబోణీ
వన్నెచిన్నెల రాణి ఇవ్వాళె మంచిబోణీ
నిన్నొదిలిపెడితే ఒట్టు ఈ వగలు కట్టిపెట్టు

పొగరుమోతు హాహ... పొగరుమోతు పోట్లగిత్తరా
ఓరయ్య... దీని చూపే సింగారమౌనురా
ఓరయ్య... దీని రూపే బంగారమౌనురా...
ఆఆఆఆఆఆఅ...ఆఆఆఆఆఆఅ...

 

2 comments:

అందమైన అమ్మాయి పొగరులోనూ ఓ సొగసుంటుంది..

హహహహ బాగా చెప్పారండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.