శనివారం, ఫిబ్రవరి 23, 2019

అనురాగానికి కనులే...

సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)
సంగీతం : కె.వి.మహదేవన్ 
సాహిత్యం : ఆత్రేయ
గానం : సుశీల, జానకి

అనురాగానికి కనులే లేవని
ఆర్యులు అన్నారూ
అనురాగానికి కనులే లేవని
ఆర్యులు అన్నారూ
అన్నది నిజమేనన్నది
నీవు రుజువు చేసినావూ
అన్నది నిజమేనన్నది
నీవు రుజువు చేసినావూ

అనురాగానికి కనులే లేవని
ఆర్యులు అన్నారూ

వేషం చూసి మోసము పోవుట
అవివేకము అన్నారు
వేషం చూసి మోసము పోవుట
అవివేకము అన్నారు
తొలి చూపులనే వలపన్నది
మది కలిగేదన్నారు
తొలి చూపులనే వలపన్నది
మది కలిగేదన్నారు

అనురాగానికి కనులే లేవని
ఆర్యులు అన్నారూ

కన్నెను నేను
కపటము ఎరుగను
చలించితి వరించితి
కన్నెను నేను
కపటము ఎరుగను
చలించితి వరించితి
కాదని నేను అనలేను
నీ కరమును బట్టి విడలేను
కాదని నేను అనలేను
నీ కరమును బట్టి విడలేను

అనురాగానికి కనులే లేవని
ఆర్యులు అన్నారూ

మగవారల మాయల
ఎరుగను నేనూ
మగువల వలపే
తెలియదు నాకు
మగవారల మాయల
ఎరుగను నేనూ
మగువల వలపే
తెలియదు నాకు
తెలియనిదిపుడే తెలిసితిమి
తెలిసినయటులే కలిసితిమి
తెలియనిదిపుడే తెలిసితిమి
తెలిసినయటులే కలిసితిమి

అనురాగానికి కనులే లేవని
ఆర్యులు అన్నారూ
అనురాగానికి కనులే లేవని
ఆర్యులు అన్నారూ
ఆర్యులు అన్నారూ 


2 comments:

ఈ పాట యెప్పుడో విన్నట్టు గుర్తు..థాంక్స్ ఫర్ పోస్టింగ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.