శనివారం, ఫిబ్రవరి 16, 2019

అసలు నీవు రానేల...

నిత్యకళ్యాణం పచ్చతోరణం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నిత్యకళ్యాణం పచ్చతోరణం (1960)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : ఆరుద్ర
గానం : పి.బి.శ్రీనివాస్, జిక్కి

అసలు నీవు రానేలా..
అంతలోనె పోనేలా..
మనసు దోచి చల్లగ జారే
పిల్లదానా ఆగవేలా
పిలదాన ఆగవేలా

ఇపుడు వెంట పడకోయి
మరల రేపు కలదోయీ
పరులు చూడ మంచిది కాదు
పిల్లవాడా చాలునోయి
పిలవాడ చాలునోయి


పారిపోవు లేడిపిల్ల
ప్రాణమింక నిలచుట కల్ల
పారిపోవు లేడిపిల్ల
ప్రాణమింక నిలచుట కల్ల
మాట వినక పోయేవంటే
మనకు మనకు ఇదిగో డిల్ల

అసలు నీవు రానేలా..
అంతలోనె పోనేలా..
మనసు దోచి చల్లగ జారే
పిల్లదానా ఆగవేలా
పిలదాన ఆగవేలా

అల్లరింక చేయవద్దు
పొయినదోయి చాలా పొద్దు
అల్లరింక చేయవద్దు
పొయినదోయి చాలా పొద్దు
దేనికైన ఉండాలోయి
తెలుసా తెలుసా కొసకో హద్దు

ఇపుడు వెంట పడకోయి
మరల రేపు కలదోయీ
పరులు చూడ మంచిది కాదు
పిల్లవాడా చాలునోయి
పిలవాడ చాలునోయి


కలసి మెలసి ఉన్నావంటే
కలుగు నీకు ఎంతో పుణ్యం
కలసి మెలసి ఉన్నావంటే
కలుగు నీకు ఎంతో పుణ్యం
విడిచిపెట్టి పోయావంటే
వెలుగే తొలగి బతుకే శూన్యం

అసలు నీవు రానేలా..
అంతలోనె పోనేలా..
మనసు దోచి చల్లగ జారే
పిల్లదానా ఆగవేలా
పిలదాన ఆగవేలా

నీవు పైకి చెప్పే బాధ
మనసులోన నాకూ లేదా
నీవు పైకి చెప్పే బాధ
మనసులోన నాకూ లేదా
మనకు అడ్డమేదీ రాదూ
మనసు మనసు ఒకటే కాదా..

ఇపుడు వెంట పడకోయి
మరల రేపు కలదోయీ
పరులు చూడ మంచిది కాదు
పిల్లవాడా చాలునోయి
పిలవాడ చాలునోయి  


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.