శాంతి నివాసం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శాంతినివాసం (1960)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల
గానం : ఘంటసాల, జిక్కి
కమ్ కమ్ కమ్
కంగారు నీకేలనే
నావంక రావేలనే
చెలి నీకింక సిగ్గేలనే
నో నో నో
నీ జోరు తగ్గాలిగా
ఆ రోజు రావాలిగా
ఇక ఆపైన నీ దానగా
నో నో నో
కోరి ఏనాడు జతచేరి ఎగతాళిగా
చేరువైనామో ఆనాడే జోడైతిమే
కోరి ఏనాడు జతచేరి ఎగతాళిగా
చేరువైనామో ఆనాడే జోడైతిమే
ఇంత స్నేహానికే అంత ఆరాటమా
చాలులే తమరికి ఏలా ఈ తొందర
నో నో నో
నీ జోరు తగ్గాలిగా
ఆ రోజు రావాలిగా
ఇక ఆపైన నీ దానగా
నో నో నో
ఏల ఈ లీల పదిమందిలో పాటలా
పరువు మర్యాదలే లేని సయ్యాటలా
ఏల ఈ లీల పదిమందిలో పాటలా
పరువు మర్యాదలే లేని సయ్యాటలా
నీవు నా దానవై నేను నీ వాడనై
నీడగా నిలచినా చాలులే నా చెలి
కమ్ కమ్ కమ్
కంగారు నీకేలనే
నావంక రావేలనే
చెలి నీకింక సిగ్గేలనే
నో నో నో
నీ జోరు తగ్గాలిగా
ఆ రోజు రావాలిగా
ఇక ఆపైన నీ దానగా
నో నో నో
2 comments:
ఇంతందం గా పిలిస్తే అమ్మాయి ప్రేమలో పడక తప్పదు..
హహహహ అంతేనంటారా.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.