భక్త శబరి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : భక్తశబరి (1958)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
రచన : దేవులపల్లి
గానం : పి.బి.శ్రీనివాస్
ఏమి రామ కథ శబరీ శబరీ
ఏదీ మరియొక సారీ
ఏమి రామ కథ శబరీ శబరీ
ఏదీ మరియొక సారీ
ఏమి రామ కథ.. రామ కథా సుధ
ఎంత తీయనిదీ శబరీ శబరీ
ఏమి రామ కథ శబరీ శబరీ
ఏదీ మరియొక సారీ
రవికుల శశియై రాఘవుడై
రాముడయీ గుణధాముడయీ
అవతరించునట హరి మనకై
దాశరధీ దయా జలధీ
ఏమి రామ కథ శబరీ శబరీ
ఏదీ మరియొక సారీ
వాలుకనుల ఆ జానకినీ
ఓరకనుల ఒకసారి గనీ
వాలుకనుల ఆ జానకినీ
ఓరకనుల ఒకసారి గనీ
చేల శివుని విల్లందుకుని
లీల విరిచెనట
నీల నీరద శ్యాముడట
కళ్యాణ రాముడట
ఏమి రామ కథ శబరీ శబరీ
ఏదీ మరియొక సారీ
మౌని భార్య మర్యాద చెడి
ధూళిపడి శిలయైన జాలిపడి
దీనురాలి తన పదముల తాకీ
ప్రాణమొసగు కారుణ్య ధాముడట
ఏమి రామ కథ శబరీ శబరీ
ఏదీ మరియొక సారీ
2 comments:
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట..
అవునండీ.. హాయైన పాట.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.