బావామరదళ్ళు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : బావామరదళ్ళు ( 1961)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : ఆరుద్ర
గానం : జానకి
నీలి మేఘాలలో గాలి కెరటాలలో
నీవు పాడే పాటా వినిపించునే వేళ
నీలి మేఘాలలో
ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారీ
ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారీ
అపురూపమై నిలచే నా అంతరంగాన
నీలి మేఘాలలో గాలి కెరటాలలో
నీవు పాడే పాటా వినిపించునే వేళా
నీ చెలిమి లో నున్న నెత్తావి మాధురులూ
నీ చెలిమి లో నున్న నెత్తావి మాధురులూ
నా హృదయ భారమునే మరపింపజేయు
నీలి మేఘాలలో
అందుకో జాలని ఆనందమే నీవు
అందుకో జాలని ఆనందమే నీవు
ఎందుకో చేరువై దూరమవుతావూ
నీలి మేఘాలలో గాలి కెరటాలలో
నీవు పాడే పాటా వినిపించునే వేళ
2 comments:
మధురమైన పాట..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.