ఆదివారం, ఫిబ్రవరి 03, 2019

నీ గుణ గానము...

భక్త రఘునాథ్ సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భక్తరఘునాథ్ (1960)
సంగీతం : ఘంటసాల 
రచన : సముద్రాల
గానం : ఘంటసాల

ప్రభో ...ఓ ...ఓ.....
నీ గుణ గానము
నీ పద ధ్యానము
అమృత పానము
రాధే శ్యాం హే రాధే శ్యాం

నీ గుణ గానము
నీ పద ధ్యానము
అమృత పానము
రాధే శ్యాం హే రాధే శ్యాం


నీలాద్రి శిఖరాన నెలకొని యున్న
నీ నగుమోము అందము గన్నా
నీలాద్రి శిఖరాన నెలకొని యున్న
నీ నగుమోము అందము గన్నా
యే అందమైనా వెగటే నన్నా
యే అందమైనా వెగటే నన్నా
జగదేక మోహన సుందరాకారా

నీ గుణ గానము
నీ పద ధ్యానము
అమృత పానము
రాధే శ్యాం హే రాధే శ్యాం


యే యీతి బాధ ఎదురైన గానీ
మోహ వికారము మూసిన గానీ
యే యీతి బాధ ఎదురైన గానీ
మోహ వికారము మూసిన గానీ
నీ పాద సేవ విడనీయ కన్నా
నీ పాద సేవ విడనీయ కన్నా
శరణాగతా వన హే జగన్నాధా

నీ గుణ గానము
నీ పద ధ్యానము
అమృత పానము
రాధే శ్యాం హే రాధే శ్యాం 


2 comments:

యెప్పటి పాట..మరోసారి వినిపించినందుకు థాంక్స్ అండి...

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.