రాణీరత్నప్రభ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : రాణీ రత్నప్రభ (1960)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : కొసరాజు
గానం : ఘంటసాల
అహ.. హా.. ఆ.. అహ.. ఆ..
నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అందచందాల రాణి ఆ చిన్నది
నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అందచందాల రాణి ఆ చిన్నది
ఆమె చిరునవ్వులోనే హాయున్నది
ఆమె చిరునవ్వులోనే హాయున్నది
మనసు పులకించగా మధురభావాలు
నాలోన కలిగించిందీ
నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అందచందాల రాణి ఆ చిన్నది
ఆ.. ఆ.. అ.. ఆ..
మరచిపోలేను ఆ రూపు ఏనాటికి
మరచిపోలేను ఆ రూపు ఏనాటికి
మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి
మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి
తలచుకొనగానే ఎదో ఆనందము
తలచుకొనగానే ఎదో ఆనందము
వలపు జనియించగా ప్రణయగీతాలు
నాచేత పాడించింది
నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అందచందాల రాణి ఆ చిన్నది
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ
సోగ కనులారా చూసింది సొంపారగా
సోగ కనులారా చూసింది సొంపారగా
మూగ కోరికలు చిగురించే ఇంపారగా
మూగ కోరికలు చిగురించే ఇంపారగా
నడచిపోయిందీ ఎంతో నాజూకుగా
నడచిపోయిందీ ఎంతో నాజూకుగా
విడచి మనజాలనూ...
విరహ తాపాలు మోహాలు రగిలించింది..
నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అందచందాల రాణి ఆ చిన్నది
అందచందాల రాణి ఆ చిన్నది
2 comments:
పిక్ చాలా చాలా బావుందండి..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.