మంగళవారం, జనవరి 12, 2021

జయహే కృష్ణావతారా...

శ్రీ కృష్ణావతారం సినిమాలో శ్రీ కృష్ణుని కథను క్లుప్తంగా వివరించే ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీకృష్ణావతారం (1967)
సంగీతం : టి.వి.రాజు 
సాహిత్యం : సముద్రాల 
గానం : ఘంటసాల, లీల, సరోజిని, స్వర్ణలత 
 
జయహే కృష్ణావతారా
నంద యశోదా పుణ్యావతారా
జయహే కృష్ణావతారా
పాపుల నణచీ సాధుల బ్రోవగ
వ్రేపల్లె వెలసిన గోపకిశోరా
జయహే కృష్ణావతారా
 
ఎన్నోజన్మల పున్నెము పండీ 
నిన్ను కంటిరా చిన్నారి తండ్రీ
కన్నతల్లి నీ కడుపెరుగదు నా
చన్నుగుడువ కనుమూసెదు రారా
 
విషపూతన ప్రాణాపహారీ
శకటాసుర సంహారీ శౌరీ 
జయహే కృష్ణావతారా
 
కాపురమ్ము సేయలేమమ్మా వ్రేపల్లెలోన
ఓ యశోదా ఈ పాపమెందూ చూడలేదమ్మా
పాలు వెన్నమనగనీడు
పడుచునొంటిగ చనగనీడు
కలిమి ఉంటే కట్తి కుడుతురు 
కన్న సుతునిటు విడుతురా
కాపురమ్ము సేయలేమమ్మా
 
జయహే కృష్ణావతారా
నందకుమారా నవనీత చోరా
జయహే కృష్ణావతారా
జయహే కృష్ణావతారా
 
కాళింగ మడుగున, కాళీయ పడగల
కాలూని ధిమి ధిమి నాట్యము చేసి
సర్పాధీశుని దర్పము నణచిన
తాండవ నాట్యవినోదా
 
జయహే కృష్ణావతారా
కాళీయ మణిగణ రంజిత చరణా
జయహే కృష్ణావతారా
జయహే కృష్ణావతారా
 
తనువులపై అభిమానము వీడిన గాని
తరణులార ననుజేర తరము గాదులే 
సిగ్గువదలి యిరుచేతుల జోడించండి
చెల్లింతును మనసుదీర మీ కోరికలా
 
జయహే కృష్ణావతారా
గొపకుమారీ వస్త్రాపహారా 
జయహే కృష్ణావతారా
జయహే కృష్ణావతారా
 
బాలుడితడనీ శైలము 
చాల బరువనీ
మీ భయము వదలుకొండీ
నా అండను చేరగరండీ
ఈ కేలల్లాడదు నమ్మండీ
 
గోవర్థన గిరిధారీ
సురనాయక గర్వాపహారీ
జయహే కృష్ణావతారా
జయహే కృష్ణావతారా
 
కృష్ణా...ఆఆఆ...ఆఆఆ... 
రాధా మానసచోరా
నీ మధు మురళీ గానమునా 
నా మనమూ బృందావనమూ
నిలువున పూచీ నీ పద పూజకు
పిలిచేనోయీ రావోయీ
సేవలు చేకొన రావోయీ 
రాధా మానస చోరా కృష్ణా..ఆఆ.. 
 


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.