మల్లీశ్వరి చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మల్లీశ్వరి (2004)
సంగీతం : కోటి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కుమార్ సాను, సునీత
నీ నవ్వులే వెన్నెలని
మల్లెలని హరివిల్లులని
ఎవరేవేవో అంటె అననీ
యేం చెప్పను యేవి చాలవని
నీ నవ్వులే వెన్నెలని
మల్లెలని హరివిల్లులని
ఎవరేవేవో అంటె అననీ
యేం చెప్పను యేవి చాలవని
బంగారం వెలిసి పోదా నీ సొగసుని చూసి
మందారం మురిసిపోదా నీ సిగలో పూసి
వేవేల పువ్వులను పోగేసి
నిలువెత్తు పాల బొమ్మని చేసి
అణువణువు వెండి వెన్నెల పూసి
విరి తేనే తోనే ప్రాణం పోసి
ఆ బ్రహ్మ నిన్ను మళ్ళి మళ్ళి చూసి
తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి
ఎవరేవేవో అంటె అననీ
యేం చెప్పను యేవి చాలవని
పగలంతా వెంట పడినా చూడవు నా వైపు
రాత్రంతా కొంటె కలవై వదలవు కాసేపు
ప్రతి చోట నువ్వే యెదురొస్తావు
ఎటు వెళ్ళలేని వలవేస్తావు
చిరునవ్వుతోనె ఉరి వేస్తావు
నన్నెందుకింత ఊరిస్తావు
ఒప్పుకోవే నువ్వు చేసిందంతా చేసి
తప్పు నాదంటావ నానా నిందలేసి
నీ నవ్వులే వెన్నెలని
మల్లెలని హరివిల్లులని
ఎవరేవేవో అంటె అననీ
యేం చెప్పను యేవి చాలవని
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.