పోస్ట్ మాన్ చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : పోస్ట్ మాన్ (2000)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం : ఘంటాడి కృష్ణ
గానం : కె.జె.ఏసుదాస్, సుజాత మోహన్
అచ్చ తెనుగులా పదారణాల
కోమాలాంగివే చెలీ
అచ్చ తెనుగులా పదారణాల
కోమాలాంగివే చెలీ
సాయంత్ర సంధ్య వేళ నీవే
నా ప్రేమ ముగ్గులోకి రావే
ఆనతివ్వగా నా మోహనా
నీ హారతవ్వనా ప్రియా
అచ్చ తెనుగులా పదారణాల
కోమాలాంగివే చెలీ
ఆ ఛైత్ర మాసాలే మన ప్రేమ సాక్ష్యాలై
విడరాని బంధమై పోగా
నా తోడు నీడల్లే నా కంటి పాపల్లే
గుండెల్లో నిన్ను దాచుకోనా
నిన్నే చేరుకోనా ఒడిలొ వాలి పోనా
నా శ్వాసలో నిశ్వాస నీవై
నా జీవితాన ఆశ నీవై
నా చేయినందుకో రావా
అచ్చ తెనుగులా పదారణాల
కోమాలాంగివే చెలీ
ఆనతివ్వగా నా మోహనా
నీ హారతవ్వనా ప్రియా
కార్తీక వెన్నెల్లో ఎకాంత వేళల్లో
నీడల్లె నిన్ను చేరుకోన
నీ రూపే కళ్ళల్లొ కదలాడె వేళల్లొ
నీ చంటి పాపనై పోన
జగమె మురిసిపోదా ఒకటై కలసి పోగా
ఆకాశమే అక్షింతలేయ
భూమాతయే దీవించ రాగా
ఆ మూడు ముళ్ళు వేసేనా
ఆనతివ్వగా నా మోహనా
నీ హారతవ్వనా ప్రియా
అచ్చ తెనుగులా పదారణాల
కోమాలాంగివే చెలీ
సాయంత్ర సంధ్య వేళ నీవే
నా ప్రేమ ముగ్గులోకి రావే
ఆనతివ్వగా నా మోహనా
నీ హారతవ్వనా ప్రియా
అచ్చ తెనుగులా పదారణాల
కోమాలాంగివే చెలీ
2 comments:
చాలా మంచి పాట post చేసారు. నాకు చాలా ఇష్టమైన పాట. Lyrics లో ఒక చిన్న సవరణ. "ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా". ఇది "ఆనతివ్వగా నా మోహనా, నీ హారతవ్వనా ప్రియా" అని ఉండాలి.
థ్యాంక్స్ కాంత్ గారూ.. పోస్ట్ లో అప్డేట్ చేశానండీ.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.