మంగళవారం, జనవరి 19, 2021

చిట్టి నీ నవ్వంటే...

జాతిరత్నాలు చిత్రం లోని ఓ సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : జాతిరత్నాలు (2021)
సంగీతం : రాధన్  
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి  
గానం : రామ్ మిరియాల 
 
చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పట్టాసే
ఫట్టుమని పేలింద నా గుండె ఖల్లాసే
అట్ట నువ్వు గిర్రా గిర్రా 
మెలికల్ తిరిగే ఆ ఊసే
నువ్వు నాకు సెట్ అయ్యావని 
సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే

వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే
చిమ్మ చీకటిగున్న 
జిందగిలోన ఫ్లడ్ లైటేసావే
హత్తేరి నచ్చేసావే మస్తుగా నచ్చేసావే
బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని 
లోకంలోన రంగులు పుసావే

చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్ బుల్ చిట్టి 
నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టి నా రెడ్ బుల్ చిట్టి
నా ఫేసు బుక్కులో లక్ష లైకులు కొట్టావే

యుద్ధమేమీ జరగలే సుమోలేవి అసలెగరలే
చిటికెలో అలా చిన్న నవ్వుతో 
పచ్చ జెండ చూపించినావే
మేడం ఎలిజిబెత్ నీ రేంజ్ అయినా
తాడు బొంగరం లేని ఆవారా నేనే అయినా
 
మాసుగాడి మనసుకే ఓటేసావే
బంగ్లా నుండి బస్తీకీ ఫ్లయిటేసావె
తీన్మార్ చిన్నోడిని డీజే స్టెప్పులు ఆడిస్తివే
నసీబ్ బ్యాడున్నోడ్ని నవాబు చేసేస్తివే
అతిలోక సుందరివి నువ్వు ఆఫ్ట్రాల్ ఓ టపోరి నేను
గూగుల్ మ్యాప్ అయి నీ గుండెకు చేరిస్తివే

అరెరే ఇచ్చేసావే దిల్లు నాకు ఇచ్చేసావే
మిర్చి బజ్జి లాంటి లైఫులో 
నువ్వు ఆనియన్ ఏసావే
అరెరే గుచ్చాసావే లవ్వు టాట్టూ గుచ్చేసావే
మస్తూమస్తు బిరియానీలో 
నింబూ చెక్కై హల్చల్ చేసావే

చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్ బుల్ చిట్టి 
నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టి నా రెడ్ బుల్ చిట్టి
నా ఫేస్ బుక్కులో లక్ష లైకులు కొట్టావే
  

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.