ఆదివారం, జనవరి 24, 2021

అమ్మమ్మగారిల్లు...

అమ్మమ్మాగారిల్లు చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అమ్మమ్మగారిల్లు (2018)
సంగీతం : కళ్యాణిమాలిక్ 
సాహిత్యం : సిరివెన్నెల  
గానం : బాలు 

కళ్ళలో కొలువై ఉండే స్వప్నమీవేళా
కమ్మనీ కబురే పంపిందీ
గుండెలో సుడులే తిరిగే సందడీవేళా 
గొంతులో రాగాలొలికిందీ
చూలాలిగా మీ అమ్మనీ 
పొత్తిళ్ళల్లో నీ జన్మనీ 
చూడాలనుంటే రమ్మనీ
నోరార పిలిచిందీ
రారా.. కన్నా.. 
అంటున్న ఆ మమకారమే 
మా అమ్మ పుట్టిల్లూ.. 

అమ్మమ్మగారిల్లు అమ్మమ్మగారిల్లు 
అమ్మమ్మగారిల్లు 
అమ్మమ్మగారిల్లు అమ్మమ్మగారిల్లు 
అమ్మమ్మగారిల్లు

మళ్ళీ ఇన్నాళ్ళకా అని నిందుస్తూ తియ్యగా
చెయ్యారా చేరవేస్తూ వున్నదీ
రెక్కలొచ్చి రివ్వుమని ఎగిరెళ్ళిపోతే గువ్వలూ
మన్నునొదలని మానులా మిగిలున్నదీ ఇల్లూ
ఏవీ.. అందీ.. 
ఈ గూటిలో ఒకనాటి ఆ కువకువల సవ్వళ్ళు

అమ్మమ్మగారిల్లు అమ్మమ్మగారిల్లు 
అమ్మమ్మగారిల్లు  

అల్లర్లు ఆటలూ అభిమానాలు అలకలూ
ఏనాడో మరిచిపోయిన నవ్వులూ
కన్ను తడిపే జ్ఞాపకాలూ 
వరస కలిపే పిలుపులూ
అన్ని పండుగలూ ఇవ్వాళే వచ్చె కాబోలూ
ఇదిగో ఇపుడే విరిసిందిలా 
కనువిందుగా బంధాల పొదరిల్లూ

అమ్మమ్మగారిల్లు అమ్మమ్మగారిల్లు 
అమ్మమ్మగారిల్లు 
అమ్మమ్మగారిల్లు అమ్మమ్మగారిల్లు 
అమ్మమ్మగారిల్లు 
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.