శుక్రవారం, జనవరి 22, 2021

జాబిలికీ వెన్నెలకీ...

చంటి చిత్రం లోని ఓ చక్కని అమ్మ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : చంటి (1992)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సాహితి
గానం : బాలు    

జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే

ముద్దులోనే పొద్దుపోయే 
కంటి నిండా నిదరోవే 
చంటి పాడే జోలలోనే

జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే

కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకీ
అమ్మ ముద్దు కన్న వేరే ముద్ద లేదు ఆకలికీ
కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకీ
అమ్మ ముద్దు కన్న వేరే ముద్ద లేదు ఆకలికీ

దేవతంటి అమ్మ నీడే కోవెలే బిడ్డలకి
చెమ్మగిల్లు బిడ్డ కన్నే ఏడుపే అమ్మలకి
అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడా దీవెనా
బువ్వ పెట్టి బుజ్జగించే లాలనెంతో తియ్యన

మంచు కన్నా చల్లనైనా 
మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా
మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా
మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా
 

2 comments:

అమ్మ పాట అద్భుతం గా ఉందండి..

అమ్మంటేనే అద్భుతం కదండీ.. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.