గురువారం, జనవరి 21, 2021

టిప్పిరి టిప్పిరి టాటా...

కంబాలపల్లి కథలు చాప్టర్ వన్ మెయిల్ చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : కంబాలపల్లికథలు-మెయిల్ (2021)
సంగీతం : స్వీకార్ అగస్తి 
సాహిత్యం : అక్కల చంద్రమౌళి 
గానం : వేదవాగ్దేవి
 
హే.. బొమ్మా బొరుసంటు వేసే పంట 
ఏదో ఒకటేనంట
కోతికొమ్మొచ్చి నిన్నే గిచ్చి 
రేపే నీలో తంటా

గుబులేదో గూడు అల్లినాదే ఇయ్యాలే
పొద్దూ మాపు సోయే లేదాయే
పారే నీరు జారే తీరు మారేనా 
తోవే కూడేనా
కలలో ఉన్నాడే కలతే తీరేనా
అదుపే తప్పేనా గజిబిజిలో
అడుగే వింతాయే కొసరే సేరేనా 
కబురే వచ్చేనా నిజమౌనా 

హే టిప్పిరి టిప్పిరి టాటా 
టిప్పిరి టిప్పిరిటి
టిప్పిరి టిప్పిరి టాటా 
టి టి టి

టిప్పిరి టిప్పిరి టాటా 
టిప్పిరి టిప్పిరిటి
టిప్పిరి టిప్పిరి టాటా 
టిరి టిరి టి

గవ్వలేస్తేనే గళ్ళు దాటేనా 
ఎదురేముందో తెలువదుగా
మంద కదిలేనా గంట కడితేనే 
ఒక సాలెంటా నడుచునుగా
ఎగిరేటి బూగా నీకాడికి వచ్చేనా 
చెట్టుచేమా గుట్టే దాటేనా
దునికేటి చేప నీటిలోకి జారేనా 
గాలంలోన సిక్కుకుపోయేనా

కోలాటమాడి కొట్టం కాల్చేనా 
అటుఇటు తిరుగుతూ సీకటిలా

హే టిప్పిరి టిప్పిరి టాటా 
టిప్పిరి టిప్పిరిటి
టిప్పిరి టిప్పిరి టాటా 
టి టి టి

టిప్పిరి టిప్పిరి టాటా 
టిప్పిరి టిప్పిరిటి
టిప్పిరి టిప్పిరి టాటా 
టిరి టిరి టి

హే.. బొమ్మా బొరుసంటు వేసే పంట 
ఏదో ఒకటేనంట
కోతికొమ్మొచ్చి నిన్నే గిచ్చి 
రేపే నీలో తంటా

గుబులేదో గూడు అల్లినాదే ఇయ్యాలే
పొద్దూ మాపు సోయే లేదాయే
పారే నీరు జారే తీరు మారేనా తోవే కూడేనా

కలలో ఉన్నాడే కలతే తీరేనా 
అదుపే తప్పేనా గజిబిజిలో
అడుగే వింతాయే, కొసరే సేరేనా 
కబురే వచ్చేనా, నిజమౌనా

హే టిప్పిరి టిప్పిరి టాటా 
టిప్పిరి టిప్పిరిటి
టిప్పిరి టిప్పిరి టాటా 
టి టి టి

టిప్పిరి టిప్పిరి టాటా 
టిప్పిరి టిప్పిరిటి
టిప్పిరి టిప్పిరి టాటా 
టిరి టిరి టి
  

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.