బుధవారం, జనవరి 13, 2021

కృష్ణకృపా సాగరం...

మిత్రులందరకూ భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ నేటితో ధనుర్మాసం కృష్ణ పాటల సిరీస్ ని ముగిస్తున్నాను. సరిగమలు సినిమాలోని ఓ చక్కని పాటను ఈ ధనుర్మాసం చివరి రోజైన ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : సరిగమలు (1994)
సంగీతం : బోంబే రవి 
సాహిత్యం : వేటూరి 
గానం : ఏసుదాస్, చిత్ర  
 
కృష్ణకృపా సాగరం 
వేణు సుధాసేవనం
జయదేవ కృతం జననార్ధిహరం
జగదేక మతం జనమోక్షకరం.
కృష్ణకృపా సాగరం 
వేణు సుధాసేవనం

మునిజన వందిత ముఖ చిత సోమం
పశుపరివేష్టిత గిరిధర నామం
యమునా తీరం సుమన కుటీరం
నారీ నారీ నడుమ విహారం
అనంతమనేకం అఖిలాధారం 
అకాలమశోకం జగదోద్ధారం
వందే మధుసూధనం

కృష్ణకృపా సాగరం 
వేణు సుధాసేవనం

గమప పదని సరిసని సనిదప 
గమప పదని గరిసనిసా 

రాధా హృదయం రసమధునిలయం 
వాలే సమయం హరిరితి మధుపం 
అధరం శోణం మనసిజ వాణం 
మధురం మౌనం మమతల గానం
స్వరస ప్రయాణం సాప్తపదీనం
ఆఆఆఅ....ఆఆఆఆఆ...

అమలమనూనం 
ప్రణయాదీనం 
వందే నవమోహనం

కృష్ణకృపా సాగరం 
వేణు సుధాసేవనం
జయదేవ కృతం జననార్ధిహరం
జగదేక మతం జనమోక్షకరం.
కృష్ణకృపా సాగరం 
వేణు సుధాసేవనం



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.