శశి చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శశి (2021)
సంగీతం : అరుణ్ చిలువేరు
సాహిత్యం : చంద్రబోస్
గానం : సిద్ శ్రీరాం
ఒకే ఒక లోకం నువ్వే
లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే
నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే,
కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే
ప్రాణాన్నిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా
జన్మజన్మలా జంటవ్వనా
ఒకే ఒక లోకం నువ్వే
లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే
నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే
కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే
ప్రాణాన్నిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా
జన్మజన్మలా జంటవ్వనా
ఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంత నీకే నేను కావలుండనా..ఆఆ..
ఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంత నీకే నేను కావలుండనా..ఆఆ..
నిన్న మొన్న గుర్తే రాని సంతోషాన్నే పంచైనా
ఎన్నాళ్లైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా
చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా
క్షణమైన కనబడకుంటే ప్రాణమాగదే
అడుగైన దూరం వెళితే ఊపిరాడదే.. ఏ
ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టేనే
చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టేనే
దేహం నీది నీ ప్రాణమే నేనులే
ఒకే ఒక లోకం నువ్వే
లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే
నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే
కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే
ప్రాణాన్నిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా
జన్మజన్మలా జంటవ్వనా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.