శుక్రవారం, జనవరి 08, 2021

ఓ చెలీ కోపమా...

శ్రీ కృష్ణ తులాభారం సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీకృష్ణ తులాభారం (1966)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : దాశరథి
గానం : ఘంటసాల

ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా
ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా

అందాలు చిందేమోము 
కందేను ఆవేదనలో 
పన్నీట తేలించెదనే 
మన్నించవే 
 
ఓ చెలి! కోపమా... అంతలో తాపమా... 
సఖీ నీ వలిగితే నే తాళజాలా

ఓ చెలి! కోపమా అంతలో తాపమా..
సఖీ నీ వలిగితే నే తాళజాలా

ఏనాడు దాచని మేను 
ఈ నాడు దాచెదవేల?
దరిచేరి అలరించెదనే 
దయచూపవే

ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా

ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా
 
ఈ మౌనమోపగలేనే 
విరహాలు సైపగలేనే
తలవంచి నీ పదములకూ 
మ్రొక్కేనులే...  

నను భవదీయ దాసుని మనంబున
నెయ్యపుకింక బూని తాకిన అది నాకు మన్ననయ
చెల్వగు నీ పద పల్లవంబు మత్తనుపులకాగ్ర కంటక వితానము
తాకిన నొచ్చునంచు నే ననియెద
అల్క మానవు గదా ఇక నైన అరాళకుంతలా అరాళకుంతలా 0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.