శనివారం, జనవరి 16, 2021

భళా భళి నా బండీ...

మిత్రులందరకూ ముక్కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీకృష్ణ పాండవీయం సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం : టి.వి. రాజు  
సాహిత్యం : కొసరాజు
గానం : మాధవపెద్ది సత్యం
 
ఓ..ఓ..ఓహో..
ఓ..ఓ..ఓ..ఓ....ఓ..ఓ..

ఏయ్...భళా భళి నా బండీ... 
పరుగుతీసే బండి... పరుగుతీసే బండి
భళా భళి నా బండీ... పరుగుతీసే బండి
బండిలో తిండి జూడ... బ్రహ్మకు నోరూరునండి

భళా భళి నా బండీ... 
పరుగుతీసే బండి... పరుగుతీసే బండి
ఎహెహెహె... ఎహెహెహె..

తిండి లేనిదే కండ లేదురా... 
కండ లేనిదే గుండె రాదురా... 
హే తమ్ముడూ
తిండి లేనిదే కండ లేదురా... 
కండ లేనిదే గుండె రాదురా
గుండె దిటవుగా నున్నచో... 
బ్రహ్మాండములోనే ఎదురు లేదురా...
ఆ.. ఆ.. ఆ.. 

కరకర ఆకలి మండుతువుంటే... 
కమ్మని భోజన మెదురుగవుంటే
కరకర ఆకలి మండుతువుంటే... 
కమ్మని భోజన మెదురుగవుంటే
గుటకలు మ్రింగుచు కూర్చొనువాడు... 
ఉంటే వాడు వెర్రివాడు

భళా భళి నా బండీ... 
పరుగుతీసే బండి... పరుగుతీసే బండి
డ్ర్రు ఊ... ఎహెహెహె.. 

అట్టురా మినపట్టురా... 
దీన్నొదిలి పెట్టేదెట్టురా
తీపి తీపి బొబ్బట్టురా... 
అహ తింటే ఆకలి కట్టురా
పప్పుతోటి ఒక ముద్ద కలిపి... 
పచ్చడితో అనుపానమేసి..ఓహో..
పప్పుతోటి ఒక ముద్ద కలిపి... 
పచ్చడితో అనుపానమేసి
బక్క పేగులకు పట్టిస్తుంటే... 
చెప్ప శక్యమా దీని రుచి 

భళా భళి నా బండీ... 
పరుగుతీసే బండి... పరుగుతీసే బండి
డ్ర్రు ఊ... ఎహెహెహె..

సాటిలేని జగజెట్టి భీముని 
చేతుల తీట తీరునులే...
అరి చేతుల తీట తీరునులే
ఏక చక్ర పురావాసుల బెడద 
నేటి తోనే పరిమారునులే
తల్లి ఋణమ్మును తీర్చెద 
నా ధర్మమ్మును నెరవేర్చెద..
ఓ ఆత్మబంధూ...
ఓ ఆత్మబంధూ... 
నీ అండ ఉంటే 
ఎవరడ్డమైన పరిమార్చెద

భళా భళి నా బండీ... పరుగుతీసే బండి
బండిలో తిండి జూడ... మాయమైనదండి 
భళా భళి నా బండీ... పరుగుతీసే బండి
పరుగుతీసే బండి... పరుగుతీసే బండి
 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.