కన్నయ్య కోసం అమ్మ పాడిన లాలి పాటను అన్నమయ్య నోట వినే ఉంటారు కానీ అదే వెన్నదొంగ కోసం సత్యభామ పాడిన లాలిపాట ఎలా ఉంటుందో ఎపుడైనా ఊహించారా. శ్రీకృష్ణసత్య సినిమాలోని ఈ చిన్ని లాలిపాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శ్రీ కృష్ణసత్య (1971)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సముద్రాల రామానుజాచార్య
గానం : జానకి
జో అచ్యుతానంద జోజో ముకుందా !
లాలి పరమానంద లాలి గోవిందా జోజో
జో అచ్యుతానంద జోజో ముకుందా !
లాలి పరమానంద లాలి గోవిందా జోజో
వాడవాడల తిరిగి అలసినావేమో
వేడి కౌగిళ్ళలో వాడినావేమో
భక్తుల ఆర్తి విని బెంగపడినావేమో
నా ముద్దు లాలనలో నిదురపో స్వామీ
జోజో..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.