కృష్ణప్రేమ చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : కృష్ణ ప్రేమ (1961)
సంగీతం : పెండ్యాల
రచన : ఆరుద్ర
గానం : జిక్కి, వరలక్ష్మి
నవనీతచోరుడు నందకిశోరుడు
అవతారపురుషుడు దేవుడే చెలి
అవతారపురుషుడు దేవుడే
తెలియని మూఢులు కొలిచిననాడు
ఎటువంటివాడు భగవానుడే
ఎటువంటివాడు భగవానుడే
పసివయసునందే పరిపరివిధముల
ప్రజ్ఞలు చూపిన మహనీయుడే
ప్రజ్ఞలు చూపిన మహనీయుడే
హద్దుపద్దులేని ముద్దుల పాపడి
అల్లరికూడా ఘనకార్యమేనా
అల్లరికూడా ఘనకార్యమేనా
ఆ నవనీతచోరుడు నందకిశోరుడు
అవతారపురుషుడు దేవుడే చెలి
అవతారపురుషుడు దేవుడే
కోనేట యువతులు స్నానాలు చేయ
కోనేట యువతులు స్నానాలుచేయ
కోకలదొంగ మొనగాడటే
అహ కోకలదొంగ మొనగాడటే
పడతులకపుడు పరమార్ధపథము
భక్తిని నేర్పిన పరమాత్ముడే
భక్తిని నేర్పిన పరమాత్ముడే
నవనీతచోరుడు నందకిశోరుడు
అవతారపురుషుడు దేవుడే చెలి
అవతారపురుషుడు దేవుడే
పదునాలుగు జగములు పాలించువాడే
పదునాలుగు జగములు పాలించువాడే
ప్రత్యక్ష దైవము శ్రీకృష్ణుడే
ప్రత్యక్ష దైవము శ్రీకృష్ణుడే
ఎదురేమిలేని పదవి లభిస్తే
ఎటువంటివాడు భగవానుడే
ఎటువంటివాడు భగవానుడే
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.