బుధవారం, జనవరి 27, 2021

తరగతి గది దాటి...

కలర్ ఫోటో చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : కలర్ ఫోటో (2020)
సంగీతం : కాలభైరవ 
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ 
గానం : కాలభైరవ 

తొలి పలుకులతోనే కరిగిన మనసు
చిరు చినుకుల లాగే జారే
గుసగుసలను వింటూ అలలుగ వయసు
పదపదమని తీరం చేరే

ఏ పనీపాట లేనీ ఈ చల్ల గాలి
ఓ సగం చోటే కోరి మీ కథే విందా

ఊరూ పేరూ లేని ఊహా లోకానా
తారాతీరం దాటి సాగిందా ప్రేమా 

తరగతి గది దాటి తరలిన కథకీ
తెలియని తెగువేదో చేరే
అడుగులు పడలేనీ తొలి తపనలకి
ఇరువురి మొహమాటాలే 
దూరము పో..యే.. నేడే

రాణే గీత దాటే విధే మారే
తానే తోటమాలి దరే చేరే
వెలుగూ నీడల్లే కలిసే సాయంత్రం
రంగే లేకుండా సాగే చదరంగం

సంద్రంలో నదిలా జంటవ్వాలంటూ 
రాసారో లేదో ఆ దేవుడు గారు 

తరగతి గది దాటి తరలిన కథకీ
తెలియని తెగువేదో చేరే
అడుగులు పడలేనీ తొలి తపనలకి
ఇరువురి మొహమాటాలే 
దూరము పోయే



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.