సంతానం చిత్రం కోసం సుసర్ల దక్షిణామూర్తి గారు స్వరపరచిన ఒక మధుర గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : సంతానం (1955)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం : అనిశెట్టి
గానం : ఘంటసాల
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
చల్లని వెన్నెలలో
చల్లని వెన్నెలలో...
చల్లని వెన్నెలలో
చక్కని కన్నె సమీపములో...
చల్లని వెన్నెలలో
చక్కని కన్నె సమీపములో
అందమే నాలో లీనమాయెనే
ఆనందమే నా గానమాయెనే
చల్లని వెన్నెలలో
తెలి మబ్బుల కౌగిలిలో జాబిలి
తేలియాడెనే ముద్దులలో
తెలి మబ్బుల కౌగిలిలో జాబిలి
తేలియాడెనే ముద్దులలో
గాలి పెదవులే మెల్లగ సోకిన
గాలి పెదవులే మెల్లగ సోకిన
పూలు నవ్వెనే నిద్దురలో
చల్లని వెన్నెలలో
చక్కని కన్నె సమీపములో
అందమే నాలో లీనమాయెనే
ఆనందమే నా గానమాయెనే
చల్లని వెన్నెలలో
కలకలలాడే కన్నె వదనమే
కనిపింతును ఆ తారలలో..ఓ
కలకలలాడే కన్నె వదనమే
కనిపింతును ఆ తారలలో
కలకాలము నీ కమ్మని రూపము
కలకాలము నీ కమ్మని రూపము
కలవరింతులే నా మదిలో...ఓ..ఓ..
చల్లని వెన్నెలలో
చక్కని కన్నె సమీపములో
అందమే నాలో లీనమాయెనే
ఆనందమే నా గానమాయెనే
చల్లని వెన్నెలలో
1 comments:
చల్లని వెన్నెల చకచక
నుల్లము పరిచెను జిలేబి నూపిరి తగిలెన్ !
మెల్లన కన్నియ వదనము
జల్లన దరి రాగ వీచె జావళి రాగం !
జిలేబి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.