బుధవారం, జూన్ 15, 2016

ఎంత సొగసుగా ఉన్నావు...

పుణ్యవతి చిత్రం కోసం ఘంటసాల గారు స్వరపరచి గానం చేసిన ఒ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పుణ్యవతి (1967)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల

ఎంత సొగసుగా ఉన్నావు
ఎలా ఒదిగి పోతున్నావు
కాదనక, ఔననక
కౌగిలిలో దాగున్నావు

ఎంత సొగసుగా ఉన్నావు అహాహా
ఎలా ఒదిగి పోతున్నావు ఆహాహ
కాదనక అహ ఔననక అహా
కౌగిలిలో దాగున్నావు 
ఎంత సొగసుగా ఉన్నావు

అందీ అందని హంసల నడకలు
ముందుకు రమ్మెనెను .. ఆఅ..
చిందీ చిందని చిరు చిరునవ్వులు
ఎందుకు పొమ్మనెను.. ఆఅ.అ..
అందీ అందని హంసల నడకలు
ముందుకు రమ్మెనెను
చిందీ చిందని చిరు చిరునవ్వులు
ఎందుకు పొమ్మనెను
నీ తనువే తాకగానే
నా మది ఝుమ్మనెను
 
  
ఎంత సొగసుగా ఉన్నావు అహాహా
ఎలా ఒదిగి పోతున్నావు ఆహాహ
కాదనక అహ ఔననక అహా
కౌగిలిలో దాగున్నావు
 
ఎంత సొగసుగా ఉన్నావు

తడిసీ తడియని నీలి కురులలో
కురిసెను ముత్యాలు..ఆఅ..
విరిసీ విరియని వాలు కనులలో
మెరిసేను నీలాలు...ఆఆ..ఆ..
తడిసీ తడియని నీలి కురులలో
కురిసెను ముత్యాలు
విరిసీ విరియని వాలు కనులలో
మెరిసేను నీలాలు,
పులకించే పెదవులపై
పలికేను పగడాలు
 
ఎంత సొగసుగా ఉన్నావు అహాహా
ఎలా ఒదిగి పోతున్నావు ఆహాహ
కాదనక అహ ఔననక అహా
కౌగిలిలో దాగున్నావు 
ఎంత సొగసుగా ఉన్నావు


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.