గురువారం, జూన్ 02, 2016

అ.ఆ.. All Songs Lyrics...

ఈ రోజు త్రివిక్రం గారు తెలుగు ప్రేక్షకులతో కొత్తగా అ.ఆ..లు దిద్దించే ప్రయత్నం చేస్తున్న సంధర్బంగా... ఆ చిత్రం యూనిట్ మొత్తానికి ఆల్ ద బెస్ట్ చెబుతూ ఇప్పటికే ది బెస్ట్ అనిపించుకున్న పాటల సాహిత్యం మీకోసం. ఈ పాటలు ఆన్ లైన్  లో ఇక్కడ వినవచ్చు పాటల ప్రోమో వీడియోస్ ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అ.ఆ..(2016)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : అభయ్ జోద్పుర్కర్, అంజనా సౌమ్య, సాయిశివాని, చిత్ర

హే..రామ్ములగా బుగ్గలవాడా
బురుజుగోడ నిబ్బరాలా కండలవాడా
రాజాంపేటా లాకుల కాడా
కలుసుకుంట కాసులపేరు పట్టకరారా
అల్లాబక్షు అత్తరు దెచ్చా
కొత్తపేట కోకా రైకా కట్టుకొచ్చా
రంగమెల్లే రైలుబండి రయ్యిమంది
పెట్టేబేడా పట్టుకొచ్చా

నిద్దర చాలని బద్దకమల్లే ఒళ్ళిరిచిందీ ఆకాశం
రాతిరి దాచిన రబ్బరు బంతై తిరిగొచ్చిందీ రవిబింబం
వెలుతురు మోస్తూ దిగివస్తున్నది గాల్లో గువ్వల పరివారం
సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమందీ పచ్చదనం
మౌనంగా… ధ్యానంలో ఉందీ.. మాగాణం..

చిట్టి వడ్రంగి పిట్టల టిక్కూ టిక్కూ
కొమ్మ రెమ్మల్లో మైనాల కుక్కూ కుక్కూ
ఇదిపల్లెకి తెలిసిన మెలొడీయా...
యా.. య్యా.. యా.. య్యా..
యా.. య్యా.. యా.. య్యా..

యయా.. ముగ్గులూ ముంగిళ్ళూ
యయా.. ప్రేమలూ నట్టిళ్ళూ
యయా.. చూడగా చాలేనా రెండే కళ్ళు
యయా.. పువ్వులూ పుప్పొళ్ళూ
యయా.. పంటలూ నూర్పిళ్లూ
యయా.. పండగలు తిరణాళ్లూ
ఈ పచ్చిగాలి జోలలూ నచ్చనోళ్లు లేరట

కళ్ళాపి చల్లాలి రాయేందె రంగమ్మా
కవ్వాలు తిప్పాలి కానియ్యె గంగమ్మా
కావిళ్లు మొయ్యాలి కడవిట్ట ఇయ్యమ్మా
పొద్దెక్కి పోతాంది ఇంకా ఆలస్యమా
యాయా..యాయా..యాయా..యాయా..
యాయా..యాయా..యాయా..యాయా..

కోపాల గోపాల అలకేలరా
దీపాల వేళాయే అగుపించరా
కోపాల గోపాల అలకేలరా
చీకటి వేళకి నీ పంచన
చేరని మనసిది శమించునా
వెన్నని మన్నని దొసములెన్నను
చెల్లాట చాలించరా
అల్లరి చేష్టల దండించనా
అక్కున జేరిచి లాలించనా
నెమ్మది చెదిరిన అమ్మను
చూడగ బిరాన రారా దొరా
కోపాల గోపాల కోపాల గోపాల
కోపాల గోపాల అలకేలరా
దీపాల వేళాయే అగుపించరా


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


చిత్రం : అ.ఆ..(2016)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : రమ్య, సాయిశివాని, రాహుల్ నంబియార్

నలుపు తెలుపున కాటుక కళ్ళకు
రంగు రంగు కలనిచ్చిందెవ్వరు
దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరూ
నిదుర మరచినా రెప్పల జంటకు
సిగ్గు బరువు అరువిచ్చిందెవ్వరు
బుగ్గ నునుపులో మెరుపై వచ్చిందెవరూ

నా వసంతం నీకు సొంతం
నా సమస్తం నీదే కదా నేస్తం
నా ప్రపంచం పొడవు మొత్తం
వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం
రంగ్ దే రే రంగ్ దే రే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రే
రంగ్ దే రే రంగ్ దే రే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రే

రంగ్ దే రే రంగ్ దే రే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే
ఏడు వర్ణాల హరివిల్లు నాదే

ముద్దు రంగేయద్దు పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ
మత్తు రంగేయద్దు నా మేని ఒంపులకి
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ

నా వసంతం నీకు సొంతం
నా సమస్తం నీదే కదా నేస్తం
నా ప్రపంచం పొడవు మొత్తం
వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం

నీలిమేఘం నెమలి పింఛం
రెంటికీ లేదు ఏమంత దూరం
ఒకటి హృదయం ఒకటి ప్రాణం
వాటినేనాడు విడదీయలేం

హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే
రంగ్ దేర రంగ్ దే రంగ్ దే
హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే
హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే
రంగ్ దేర రంగ్ దే రంగ్ దే
హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే

ఏడు వర్ణాల హరివిల్లు నాదే
ముద్దు రంగేయద్దు పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ
మత్తు రంగేయద్దు నా మేని ఒంపులకి
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ

రామ బాణం సీత ప్రాణం
జన్మలెన్నైన నీతో ప్రయాణం
రాధ ప్రాయం మురళి గేయం
జంట నువ్వుంటె బృందావనం

హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే
రంగ్ దేర రంగ్ దే రంగ్ దే
హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే
హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే
రంగ్ దేర రంగ్ దే రంగ్ దే
హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే

ఏడు వర్ణాల హరివిల్లు నాదే
ముద్దు రంగేయద్దు పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ
మత్తు రంగేయద్దు నా మేని ఒంపులకి
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


చిత్రం : అ.ఆ..(2016)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : కృష్ణ చైతన్య
గానం : కార్తీక్, రోల్ రిడ (రాప్)

మీరేమొ బంగారు ఆల్మోస్టిది అమ్మోరు
అయ్ బాబోయ్ ఏంటి సారు
ఆదాయం జస్ట్ ఆరు ఖర్చేమొ పదహారు
మెయింటేనెన్స్ కష్టం బ్రదరూ

మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా బుట్టబొమ్మ
రాసులు పోసి పెంచారో ఏమో పల్లకి దిగమ్మా
నీటిని పూలు ముంచేసినట్టు చిత్రంగున్న పెంకి తనమా
మబ్బుని మంచు మింగేసినట్టు ఉందే ఈబొమ్మా

అనసూయ కోసం పడుతున్నా నానా హైరానా
ఎదిగే ఏ దేశం తననే పోషించడమీజీనా
శిక్షే ఏదైనా పడుతుందా ఇంతటి జరిమానా
మన పరువు కోసం మొయ్యాలిక నిండా మునిగైనా
లేదంటే నీకు కనికరమా.. నా లాంటి వాడు మోయతరమా
నువ్వేసే బిల్లు పిడుగమ్మా.. కాదమ్మా వల్ల కాదమ్మా
నీకేమొ నేను హిరోషిమ్మా.. నీ దాడి తట్టుకోలేనమ్మా
ఇంత పగ అవసరమా.. చుక్కల్నే చూపించకమ్మా

మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా బుట్టబొమ్మ
రాసులు పోసి పెంచారో ఏమో పల్లకి దిగమ్మా
నీటిని పూలు ముంచేసినట్టు చిత్రంగున్న పెంకి తనమా
మబ్బుని మంచు మింగేసినట్టు ఉందే ఈ బొమ్మా

ఔటింగ్ అనీ కేంపింగ్ అనీ ప్రతి రోజూ ఏదో న్యూసెన్సు
ఎవరెస్టుకి యమరిస్కుకి ఈ పిల్లేగా ఒక రిఫరెన్సు
అనసూయకీ అనకొండకీ రెండేగా లెటర్స్ డిఫరెన్సు
ఏ..నరులకి తెలియని నరకపు తలుపుకి తాళం ఇదే
ఇదే...ఇద...ఇదే... ఇదే...
ఎద్దే ఎక్కిన యముడికి ఏజెంట్ ఇదే
ఇదే... ఇదే... ఇదే... ఇదే...
కరెంటు కూడ కొట్టనంత షాక్ నువ్వు
ఓ రాక్షసి సునామీకే బినామీనువ్వు
మా ఊరికే మూడో ప్రపంచవారు నువ్వు
వేదిస్తా వెందుకే

మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా బుట్టబొమ్మ
రాసులు పోసి పెంచారో ఏమో పల్లకి దిగమ్మా
నీటిని పూలు ముంచేసినట్టు చిత్రంగున్న పెంకి తనమా
మబ్బుని మంచు మింగేసినట్టు ఉందే ఈ బొమ్మా
ఎలా... ఎలా... ఎలా.. ఎలా..


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


చిత్రం : అ.ఆ..(2016)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : శ్రావణ భార్గవి

అఆల్లోనే అం ఆః లా ..
అర్ధరాత్రి మోగే అల్లారంలా
ఆరంభంలో ఇంటర్వెల్లా
ఆనందంలో అంతరాయమా
అమ్మంటేనే ఆటంబాంబా
అయ్యో రామా పేలుతోందా పిల్లా
హెయిరుపిన్నే ముల్లయ్యిందా
చిల్లడిందా చిట్టితలా
జెయింట్ వీలు ఏదో గిర గిర గిర గిర
గుండెలోన సుడి తిరిగిందే
ఉన్నపాటుగా నరనరనరనరమున
తౌజండ్ వాట్స్ పవరేదో పాకిందే

హే..మమ్మీ రిటర్న్స్ హో..మమ్మీ రిటర్న్స్
యో..మమ్మీ రిటర్న్స్.. ఓ గాడ్ వాట్ టు డు..
హే..మమ్మీ రిటర్న్స్ హో..మమ్మీ రిటర్న్స్
యో..మమ్మీ రిటర్న్స్.. పద పద పరుగిడు

హే..మమ్మీ రిటర్న్స్ హో..మమ్మీ రిటర్న్స్
యో..మమ్మీ రిటర్న్స్.. ఓ గాడ్ వాట్ టు డు..
హే..మమ్మీ రిటర్న్స్ హో..మమ్మీ రిటర్న్స్
యో..మమ్మీ రిటర్న్స్.. పద పద పరుగిడు

కాలమే కదలదే తరిమినా మొండికేస్తోందే
దూరమూ తరగదే పరుగుతో పందెమేస్తోందే
ఇంతలోనె ఎంత తేడా రైజయ్యిందే గుండెదడ
అమ్మ ఆదిశక్తి నీడా ఆఅ.. భయపెడుతోందే
స్పీడో మీటర్ ముల్లు సర సర సర సర
రేంజు దాటి రెచ్చిపోతోందే
టాపులేచే టెన్షన్ రయ్యి రయ్యి రయ్యిమని
యాక్సిలరేటర్ పైనే ఎక్కి కూర్చుందే

హే..మమ్మీ రిటర్న్స్ హో..మమ్మీ రిటర్న్స్
యో..మమ్మీ రిటర్న్స్.. ఓ గాడ్ వాట్ టు డు..
హే..మమ్మీ రిటర్న్స్ హో..మమ్మీ రిటర్న్స్
యో..మమ్మీ రిటర్న్స్.. పద పద పరుగిడు

హే..మమ్మీ రిటర్న్స్ హో..మమ్మీ రిటర్న్స్
యో..మమ్మీ రిటర్న్స్.. ఓ గాడ్ వాట్ టు డు..
హే..మమ్మీ రిటర్న్స్ హో..మమ్మీ రిటర్న్స్
యో..మమ్మీ రిటర్న్స్.. పద పద పరుగిడు


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


చిత్రం : అ.ఆ..(2016)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : కార్తీక్

నువ్వు పక్కనుంటే బాగుంటాదే,
నీ పక్కనుంటే బాగుంటాదే
నువ్వు కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదే
కత్తి పెట్టి గుచ్చినా సమ్మగుంటాదే
అట్ట వచ్చి ఇట్ట నువ్వు తిప్పుకుంట
వెళ్ళిపోతే ఎక్కడో కలుక్కుమంటాదే

ఎళ్ళిపోకె శ్యామలా..
ఎళ్ళమాకె శ్యామలా
నువ్వు వెళ్ళిపోతే అస్సల
ఊపిరాడదంట లోపల
ఎళ్ళిపోకె శ్యామలా
ఎక్కి ఎక్కి ఏడవ లేదే ఎదవ మగ పుటక
గుండె పెరికినట్టుందే నువ్వే ఎళ్ళినాక

ఎళ్ళిపోకె శ్యామలా..
హే ఎళ్ళమాకె శ్యామలా
నువ్వు వెళ్ళిపోతే అస్సల
ఊపిరాడదంట లోపల
ఎళ్ళిపోకె శ్యామలా..

హ్మ్.. నరం లేని నాలిక నిన్ను
ఎలిపొమ్మని పంపిందాయె
రథం లేని గుర్రం లాగా
బతుకే చతికిలబడిపోయే
నీ పోస్టరు అడ్డంగా చింపేశాననుకున్నా
గుండెల్లో నీదే సినిమా ఆడుతున్నదే
స్విచ్చేస్తే ఎలిగేదా ఉఫ్ అంటే ఆరేదా
ఊపిరిలో మంటల్లే నీ ప్రేమె ఉన్నదే
ప్రాణాన్నే పటకారేసీ పట్టేసీ
నీతో పట్టుకు పోమాకే
గెలిచేసి నన్నొదిలేసి
సీకటైన కోటలాగా సెయ్యమాకే

నువ్ ఎళ్ళిపోకే శ్యామలా
నువ్ ఎళ్ళమాకె శ్యామలా
ఏమీ బాగాలేదే లోపల
నువ్ ఎళ్ళిపోకె ఎళ్ళిపోకె
ఎళ్ళిపోకే శ్యామలాఅ..

మనసుకంటుకున్నదో
మల్లెపూల సెంటు మరక
మరిచిపోదమంటె గుర్తుకొస్త
ఉందా నిప్పు సురక
ఏటి సెయ్యనోరి సైదులు
గుండెలోన గుచ్చిపోయినాది సూదులు
నానేటి సెయ్యనోరి సైదులు
గుండెల్లోన గుచ్చిపోయినాది సూదులు

ఎళ్ళిపోకె శ్యామలా..
అట్ట ఎళ్ళమాకె శ్యామలా
నువ్వు వెళ్ళిపోతే అస్సలా
ఊపిరాడదంట లోపలా


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.