ఆదివారం, జూన్ 05, 2016

చిటపట చినుకులు పడుతూ..

ఆత్మబలం చిత్రం కోసం మహదేవన్ గారు స్వరపరచిన ఒక అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆత్మబలం (1964)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, సుశీల

చిటపట చినుకులు పడుతూ ఉంటే
చెలికాడె సరసన ఉంటే..
చెట్టాపట్టగ చేతులు పట్టి
చెట్టు నీడకై పరుగిడుతుంటే

చెప్పలేని ఆ హాయి
ఎంతో వెచ్చగ ఉంటుందోయీ
చెప్పలేని ఆ హాయి
ఎంతో వెచ్చగ ఉంటుందోయీ


ఉరుములు పెళపెళ ఉరుముతు ఉంటే..
మెరుపులు తళ తళ మెరుస్తు ఉంటే..
మెరుపు వెలుగులో చెలి కన్నులలో
బిత్తర చూపులు కనపడుతుంటే..

చెప్పలేని ఆ హాయి
ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చెప్పలేని ఆ హాయి
ఎంతో వెచ్చగ ఉంటుందోయీ

కారు మబ్బులు కమ్ముతు ఉంటే
కమ్ముతు ఉంటే..ఓ..ఓ..
కళ్ళకు ఎవరూ కనపడకుంటే
కనపడకుంటే ఆ..
కారు మబ్బులు కమ్ముతు ఉంటే
కమ్ముతు ఉంటే..ఓ..ఓ..
కళ్ళకు ఎవరూ కనపడకుంటే

కనపడకుంటే
జగతిని ఉన్నది మనమిద్దరమే
అనుకొని హత్తుకు పోతుంటే
జగతిని ఉన్నది మనమిద్దరమే
అనుకొని హత్తుకు పోతుంటే

 
చెప్పలేని ఆ హాయీ
ఎంతో వెచ్చగ ఉంటుందోయీ..

చెప్పలేని ఆ హాయీ
ఎంతో వెచ్చగ ఉంటుందోయీ..

చలి చలిగా గిలివెస్తుంటే..ఆ హా హా
గిలిగింతలు పెడుతూ ఉంటే..ఓహోహో.
చలి చలిగా గిలివెస్తుంటే..ఆ హా హా
గిలిగింతలు పెడుతూ ఉంటే..
ఓహోహో.

చెలి గుండెయిలో రగిలే వగలే
చెలి గుండెయిలో రగిలే వగలే
చలిమంటలుగా అనుకుంటే. 

చెప్పలేనీ ఆ హాయీ
ఎంతో వెచ్చగ ఉంటుందోయీ
చెప్పలేనీ ఆ హాయీ
ఎంతో వెచ్చగ ఉంటుందోయీ
 
చిటపట చినుకులు పడుతూ ఉంటే..
చెలికాడె సరసన ఉంటే..
చెట్టాపట్టగ చేతులు పట్టి
చెట్టు నీడకై పరుగిడుతుంటే..
చెప్పలేని ఆ హాయి
ఎంతో వెచ్చగ ఉంటుందోయీ
చెప్పలేని ఆ హాయి
ఎంతో వెచ్చగ ఉంటుందోయీ



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.