మంగళవారం, జూన్ 07, 2016

నన్ను ఎవరో తాకిరి...

సత్తెకాలపు సత్తెయ్య చిత్రం కోసం ఎం.ఎస్.విశ్వనాథన్ గారు స్వరపరచిన ఒక మధుర గీతాన్ని నేడు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సత్తెకాలపు సత్తెయ్య (1969)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల, సుశీల

నన్ను ఎవరో తాకిరి.. కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి
నన్ను ఎవరో తాకిరి.. కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి

నన్ను ఎవరో చూచిరి.. కన్నె మనసే దోచిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి
నన్ను ఎవరో చూచిరి.. కన్నె మనసే దోచిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి

ఆ బుగ్గల లేత సిగ్గు.. నా కోసం పూచినదేమో
ఆ బుగ్గల లేత సిగ్గు.. నా కోసం పూచినదేమో
సిగ్గులన్ని దోచుకుంటే.. తొలివలపే ఎంతో హాయి
ఆ మగసిరి అల్లరి అంతా నా కోసం దాచినదేమో
ఆ మగసిరి అల్లరి అంతా నా కోసం దాచినదేమో
అందగాడు ఆశపెట్టే సయ్యాటలు ఎంతో హాయి 

నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి
ఆ.... ఆహ్హ.... ఆహ్హ్... ఆహ్... 
ఆ.... హ్హఆ....హ్హఆ...హ్హ్..ఆ....

ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో
ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో
మల్లెలాగ నేను కూడా జడలోనే ఉంటే హాయి

ఆ చల్లని కన్నుల కాంతి నా కోసం వెలిగినదేమో
ఆ చల్లని కన్నుల కాంతి నా కోసం వెలిగినదేమో
కాంతిలాగ నేను కూడా ఆ కన్నుల నిలిచిన చాలు 

నన్ను ఎవరో చూచిరి .. కన్నె మనసే దోచిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి

నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.