ప్రేమించి చూడు చిత్రంలోని ఓ మధుర గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ప్రేమించి చూడు (1965)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : పి. బి. శ్రీనివాస్, సుశీల
ఓ...ఓ....ఓ...ఓ....ఓ...ఓ...
వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ
వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ
చల్లని జాబిలి నవ్వెను మరీ మరీ
అల్లరి వాడా నీదే ఈ చెలీ
చూపులతోనే మురిపించేవూ
చూపులతోనే మురిపించేవూ
ఆటలతోనే మరిపించేవూ
ఆటలతోనే మరిపించేవూ
చెలిమీ ఇదేనా మాటలతో సరేనా
చెలిమీ ఇదేనా మాటలతో సరేనా
పొరపాటైతే పలకనులే పిలవనులే
దొరకనులే.. ఊరించనులే..
వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ
నా మనసేమో పదమని సరేసరే
నా మనసేమో పదమని సరే సరే
మర్యాదేమో తగదని పదే పదే
మూడు ముళ్ళు పడనీ
ఏడు అడుగులు నడవనీ
మూడు ముళ్ళు పడనీ
ఏడు అడుగులు నడవనీ
వాదాలెందుకులే అవుననినా కాదనినా
ఏమనినా.. నాదానివిలే..
చల్లని జాబిలి నవ్వెను మరీ మరీ
అల్లరి వాడా నీదే ఈ చెలీ
వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ
అహా...అహా..అహ..ఆ
ఓహొహొ.. ఓహో..ఓ..
ఊహుహు..ఊహు..ఊ..
2 comments:
పీ బీ శ్రీనివాస్ గారి గొంతులో మెలొడీ చాలా హృద్యంగా ఉంది వేణూజీ..
అవునండీ వారి స్వరం ప్రత్యేకం.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.