డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం ఎస్ రాజేశ్వరరావు గారు స్వరపరచిన ఒక మధురగీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : సుశీల
నీవు లేక వీణ పలుక లేనన్నది
నీవు రాక రాధ నిలువ లేనన్నది..ఆ..
జాజి పూలు నీకై.. రోజు రోజు పూచె
చూచి చూచి పాపం.. సొమ్మసిల్లిపోయే
చందమామ నీకై.. తొంగి తొంగి చూచి
చందమామ నీకై తొంగి తొంగి చూచి..
సరసన లేవని అలుకలుబోయె
నీవు లేక వీణ
కలలనైన నిన్ను.. కనుల చూతమన్న
నిదుర రాని నాకు.. కలలు కూడా రా..వే
కదలలేని కాలం.. విరహ గీతి రీతి
కదలలేని కాలం విరహ గీతి రీతి..
పరువము వృధగా బరువుగ సాగే
నీవు లేక వీణ
తలపులన్ని నీకై.. తెరచి వుంచినాను
తలపులెన్నో మదిలో.. దాచి వేచినాను
తాపమింక నేను.. ఓపలేను స్వామి
తాపమింక నేను ఓపలేను స్వామి..
తరుణిని.. కరుణను.. యేలగ రావా...
నీవు లేక వీణ పలుక లేనన్నది
నీవు రాక రాధ నిలువ లేనన్నది..ఆ..
నీవు లేక వీణా..ఆ..
1 comments:
తలపుల తెరిచెను జలజల
వలపుల తరుణికి మురిపెము వగదెగ నయ్యెన్ !
పలికిన సరసపు కవితలు
కిలకిల కలలన అలుకలు కిసలయ మయ్యెన్ !
జిలేబి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.