శనివారం, జూన్ 25, 2016

పద పదవె వయ్యారి గాలిపటమా...

కులదైవం చిత్రంలోని ఓ హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కులదైవం (1960)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సముద్రాల (జూనియర్)
గానం : ఘంటసాల, జమునారాణి

పదపదవే వయ్యారి గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగా ఎగిరిపోయి
పక్కచూపు చూసుకుంటూ
తిరిగెదవే గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా

ప్రేమగోలలోన చిక్కిపోయినావా
నీ ప్రియుడున్న చోటుకై పోదువా
ఓ... ప్రేమగోలలోన చిక్కిపోయినావా
నీ ప్రియుడున్న చోటుకై పోదువా
నీ తళుకంతా నీ కులుకంతా
అది ఎందుకో తెలుసును అంతా

పదపదవే వయ్యారి గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగా ఎగిరిపోయి...
పక్కచూపు చూసుకుంటూ...
తిరిగెదవే గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా

ఆఅహాఆహహహహాఆఅ
ఓహోహోహోఓహోహో

నీకు ఎవరిచ్చారే బిరుదు తోక
కొని తెచ్చావేమో అంతేగాక...
ఆ... నీకు ఎవరిచ్చారే బిరుదు తోక
కొని తెచ్చావేమో అంతేగాక..
రాజులెందరూడినా మోజులెంత మారినా
తెగిపోక నిలిచె నీ తోక

పదపదవే వయ్యారి గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగా ఎగిరిపోయి...
పక్కచూపు చూసుకుంటూ...
తిరిగెదవే గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా

అహ..హ..అహ..హా..అహ..హా...
అహ..హ..అహ..హా
నీలి మబ్బుల్లో ఆడుకుందువేమో
మింట చుక్కల్తో నవ్వుకుందువేమో ...ఓ...
నీలి మబ్బుల్లో ఆడుకుందువేమో
మింట చుక్కల్తో నవ్వుకుందువేమో ...ఓ...
వగలాడివిలే జగదంతవులే
దిగిరాకుండా ఎటులుందువులే

పదపదవే వయ్యారి గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగా ఎగిరిపోయి...
పక్కచూపు చూసుకుంటూ...
తిరిగెదవే గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా

 

6 comments:

జగదంతవులే .. అంటే ? జగానికి అంతు ఉంది అందుకని నువ్వు దిగక తప్పదు అన్నట్టా?

అయుండకపోవచ్చండీ.. అలా అయితే జగదంతము అని రాసేవారు. బహుశా దారం కట్టి ఎగరేస్తాం కదా దానికి ఏదైనా రిలేటెడ్ అయుండచ్చు.

దొరికావు అమ్మదొంగా, దొరికావులే
దొరక్కుండా ఎటు పోయేవులే
నీకోసం జగమంతా తిరిగానులే
జగజంతువులే, భలే మాయలాడివిలే!

(ఆ పదం "జగజంతువు" అయి ఉండాలి, జగదంతువు కాదు... జగజంతువంటే మాయలాడి ఆట. నా పేపరు నిఘంటువు ప్రకారం)

అవునండీ నేను ఫేస్బుక్ లో తెలుగు సందేహాలు గ్రూప్ లో అడిగినపుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అది జగజంతవులే అని. జగజంత అంటే మాయలాడి అని అర్థముందని చెప్పారు. అలాగె ’సజ్జలు’ ’సద్దలు’ ఐనట్లు కొన్ని మాటల్లో జ ద అవుతుందని అన్నారు అందుకే అలా రాసి ఉండవచ్చు.

హమ్మయ్య, ఆ “జగదంతవు” అన్న పదం గురించిన మిస్టరీ విడిపోయింది. ఆసక్తి కొలదీ నేనూ “ఆంధ్రభారతి”లో మహా వెదికాను కానీ “జగదంతవు” దొరకలేదు. అది “జగజంతవు” అన్నమాట ? మీరు పట్టు విడవక అసలు పదాన్ని పట్టుకున్నారు. బాగుందండీ.

పాట మరోసారి విన్నాను. ఘంటసాల గారు “జగదంతవులే” అనే పలికినట్లు వినిపించింది. పైన మీరన్నట్లు “జ” “ద” అయినట్లుంది.

థాంక్స్ ఫర్ ద కామెంట్ నరసింహారావు గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.